Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈఎంఆర్ఐ 108లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Advertiesment
ambulence
, ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (15:36 IST)
అత్యవసర సమయాల్లో రోగులను ఆదుకునేవారిని ఆదుకునే 108లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్ (ఈఎంఆర్ఐ)లో సిద్దిపేట జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. 
 
ఇందులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ), డ్రైవర్ (పైలెట్), ఎమర్జెన్సీ రెస్సాన్స్ ఆఫీసర్ (ఈఆర్ఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ సలీం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు బీఎస్సీ (బీజెడ్సీ), బీఎస్సీ (నర్సింగ్), జీఎన్ఎం, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, డీఎంఎల్ టీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకూడదు. పైలెట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి పాస్ సర్టిపికెట్‌తో పాటు లైట్ మోటార్ వెహికల్ బ్యాడ్జి కలిగి ఉండాలని షేక్ సలీం చెప్పారు. వయసు 23 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలని వివరించారు. ఇక ఈఆర్ఓ పోస్టుకు ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బేసిక్ కంప్యూటర్ పరిజ్జానం కలిగి ఉన్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.
 
అయితే, ఈ పోస్టులకు ఎంపికయ్యేవారు హైదరాబాద్‌లో, మిగిలిన వారు సిద్దిపేట జిల్లా పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్‌తో ఈ నెల 13 (సోమవారం) నాడు సిద్ధిపేట బురుజు వద్ద గల ఓల్ట్ ఎంసీహెచ్ స్వచ్చబడి మీటింగ్ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూ కు హాజరుకావాలి. పూర్తి వివరాల కోసం 73309 67634 అనే నంబరులో సంప్రదించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శిథిలాల కింద 125 గంటల పాటు సజీవంగా ఉన్న 2 నెలల చిన్నారి