Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన తెలుగు టెక్కీలు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 31 మే 2022 (08:57 IST)
వర్క్ ఫ్రమ్ హోం పని చేస్తున్న కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు డ్రగ్స్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.2.35 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ టెక్కీలు గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించే క్రమంలో పెద్ద అంబర్ పేట వద్ద లారీ ఎక్కగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఏపీలోని కాకినాడ జిల్లా గొల్లలమామిడాడకు చెందిన వట్టూరి సూర్య సంపత్, రాజమండ్రికి చెందిన మోరంపూడి సూయినగర్‌కు చెందిన తీగల దీపక్ ఫణీద్ర అనే వారు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వీరింతా గత కొన్ని నెలలుగా రాజమండ్రిలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఈ క్రమంలో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డారు. 
 
దీంతో ఈ నెల 25వ తేదీన గోవాలోని ఓ వ్యక్తి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ (25 మాత్రలు), ఎల్ఎస్డీ (2స్ట్రిప్పులు) కొనుగోలు చేసి బస్సులో గోవా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత పెద్ద అంబర్ పేట వద్ద లారీ ఎక్కి రాజమండ్రికి చేరుకునేలా ప్లాన్ చేశారు. 
 
అయితే, వీరివద్ద డ్రగ్స్ ఉన్నట్టు పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో పోలీసులు నిఘా వేసి ఈ ఇద్దరు టెక్కీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2.35 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments