Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగుల పట్ల కవిత ఔదార్యం

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (08:39 IST)
నిజామాబాద్ మాజీ ఎంపీ, తెరాస నాయకురాలు కవిత నిజామాబాదు పెద్దాసుపత్రిలో పేద రోగుల కోసం ప్రారంభించిన అన్నదాన కార్యక్రమానికి రెండేళ్లు నిండాయి.

2017 నవంబరు 8 న కవిత ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం అప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ ఆస్పత్రికి జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా రోగులు వస్తుంటారు.

ఎంపీగా ఉన్నప్పుడు ఆస్పత్రి సందర్శనకు వచ్చిన కవిత పేద రోగులకు సరైన ఆహారం దొరకడం లేదనే విషయం తెలుసుకొని ఆస్పత్రిలో అన్నదానం ప్రారంభించారు. రోజూ 800 వందలమందికి పైబడి ఇక్కడ భోజనం చేస్తున్నారు.

ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి స్పందన రావడంతో జిల్లాలోని బోధన్ లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో 2018 ఏప్రిల్ 26 న అన్నదానం ప్రారంభించారు. ఇక్కడ సుమారు 400 మంది భోజనం చేస్తున్నారు. ఆ తరువాత ఆర్మూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 2018 జులై 5 నుంచి అన్నదానం ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రులకే పరిమితం చేయకుండా పేద విద్యార్థుల కోసం నిజామాబాద్ జిల్లా గ్రంథాలయం వద్ద కూడా అన్నదాన కేంద్రం 2018 జులై 15 న ప్రారంభించారు. ఇక్కడ సుమారు 250 మంది విద్యార్థులు ఆకలి తీర్చుకుంటున్నారు. పేదల పట్ల కవిత ఔదార్యం సర్వత్రా ప్రశంసలు పొందుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments