Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#BigBreaking-కేసీఆర్‌కి బిగిస్తున్న ఉచ్చు

Advertiesment
#BigBreaking-కేసీఆర్‌కి బిగిస్తున్న ఉచ్చు
, శనివారం, 31 ఆగస్టు 2019 (11:46 IST)
#TRS పార్టీని ఇరుకున పెట్టే అంశాలపై ఫోకస్ చేస్తూ వస్తున్న #BJP అబుదాబి కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న #LULU #GROUPS తో #KCR  #KTR మరియు #KAVITHAకు  ఆర్ధికపరమైన సత్సంబంధాలు ఉన్నాయని కేంద్రం ప్రభుత్వం గుర్తించినట్టు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
 
 అబుదాబి #UAE కేంద్రంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్న #LULU #GROUPS అధినేత #MA #YOUSIF #ALI కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని భావించారని, ఆలోచన వచ్చిందే తడవుగా తన ప్రతినిధులను హైదరాబాదుకు పంపించి తమ కంపెనీల ఏర్పాటు కోసం హైదరాబాదులో భూములు కావాలని, కొన్ని ప్రాంతాలను కూడా సూచించినట్టు తెలిసింది.
 
అందులో భాగంగా ప్రస్తుత సచివాలయం ఉన్న స్థలం తాము ఏర్పాటు చేయాలనుకున్న షాపింగ్ మాల్‌కు అనుకూలంగా ఉంటుందని ఎలాగైనా ఆ స్థలాన్ని తమకు అప్పగించేలా చూడాలని కోరినట్టు సమాచారం.
 
ప్రస్తుత సచివాలయాన్ని లులు గ్రూప్స్ సంస్థకు కట్టబెట్టేందుకే వాస్తు దోషం పేరుతో రక్షణ శాఖ అధీనంలో ఉన్న బైసన్ పోల్‌లో నూతన సచివాలయ నిర్మాణం చేయాలని కేసీఆర్ సంకల్పించారనేది బయట జరుగుతున్న చర్చ.
 
లులు గ్రూప్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయాన్ని మార్చే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనక ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా? లేక ఇంకేదైనా డీల్ జరిగిందా అనే కోణాల్లో కేంద్ర ప్రభుత్వం విచారిస్తున్నట్టు తెలుస్తుంది.
 
2017లో కేరళలో జరిగిన లులు గ్రూప్స్ అధినేత ఎంఏ యూసుఫ్ అలీ కుమార్తె వివాహానికి సకుటుంబ సపరివార సమేతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక విమానంలో వెళ్లారు, తనతోపాటు ప్రభుత్వంలోని మంత్రులను వెంటబెట్టుకొని వెళ్లడం అప్పట్లో చర్చంశనీయమైంది.
 
ఆ పెళ్లి సందర్భంలో ఇరుపక్షాల మధ్య జరిగిన చర్చలో ప్రస్తుతం ఉన్న సచివాలయం స్థలాన్ని లులు గ్రూప్స్ సంస్థ అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించేందుకు ఆ స్థలాన్ని అప్పగించేందుకు కేసీఆర్ ఒప్పుకున్నట్టు, దానికి ప్రతిఫలంగా పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు ఆ సంస్థ అధినేత ఆఫర్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చ.
 
సీఎం కేసీఆర్ కేరళ వెళ్ళినప్పుడు కుటుంబసభ్యులతో మంత్రులను వెంట తీసుకెళ్లడం కూడా వ్యూహంలో భాగంగా జరిగినట్టు సమాచారం, ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో బడా వ్యాపారవేత్త కూతురి పెళ్ళికి రెండు రోజుల టూర్ వెళ్తే అందరికి అనుమానం వస్తుందనే ఉద్దేశంతో మంత్రులను వెంటబెట్టుకుని వెళ్లినట్లు ఆ పెళ్ళికి వెళ్లిన ఓ మాజీ ఎంపీ తన సన్నిహితులతో చెప్పినట్టు తెలిసింది.
 
 
గత ఐదేళ్ళలో కేటీఆర్, కవిత దుబాయ్ కి ఎన్నిసార్లు వెళ్లారు, ఎవరెవరిని కలిసారు అనే కోణాల్లో కేంద్రం విచారణ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
 
మొన్న మైహోం అధినేత, మెగా గ్రూప్ ఇళ్లపై కార్యాలయాలపై ఐటి దాడులు జరిగిన నాటి నుండి కేసీఆర్ కుటుంబంలో భయాందోళనలు మొదలయ్యాయని ఇప్పుడు లులు గ్రూప్స్ వ్యవహారం బయటికి రాబోతుందనే చర్చ జరుగుతుంది.
ఇప్పటికే డచ్ విల్లా భూములపై కూడా కేంద్రం ఫోకస్ చేసినట్టు సమాచారం. జరుగుతున్న పరిణామాలన్ని గమనిస్తుంటే కేసీఆర్ కుటుంబం చుట్టు బలమైన ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నతల్లిని గొడ్డలితో నరికాడు.. మెదడును వెలికి తీసి.. పాన్‌లో వేయించాడు..