హైటెక్ సిటీ హైదరాబాద్‌లో బతకడం చాలా కష్టంరా అంటుంటారు. అయితే చాలామంది యువకులు సొంత గ్రామాల్లో ఉండలేక సిటీ లైఫ్‌లోనే గడపాలని.. అక్కడే ఉండాలనుకుంటారు. అలాంటి పనే చేశాడు వరంగల్‌కు చెందిన యువకుడు రాము. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు.. ఒక్కగానొక్క కొడుకు రాము.
అందుకే సిటీకి వెళతానంటే వద్దనలేదు. బి.టెక్. కంప్లీట్ చేసి హైదరాబాద్‌కు వెళ్ళాడు రాము. జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని.. 15 వేల రూపాయలలో ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాడు. నెలా నెలా తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుండడంతో ఆ డబ్బును ఖర్చు పెట్టడం ఇష్టం లేక తాను సొంతంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరాలనుకున్నాడు.
తల్లిదండ్రులు పంపిన డబ్బులను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవాడు. అయితే బెంగుళూరులో ఉంటున్న రాము క్లాస్‌మేట్ మధు పని మీద హైదరాబాద్ రామాంత్‌పూర్ లోని అపార్టుమెంట్‌కు వచ్చాడు. తాను ఏవిధంగా ఉంటున్నాడోనన్న విషయాన్ని రాము మధుకు చెప్పాడు. అయితే నీకు రూం రెంట్ కట్టడం ఇబ్బందిగా ఉంటే ఫ్లాట్‌ను షేర్ చేసుకో.
షేర్ అంటే తెలుసుగా.. సగం నువ్వు ఉండొచ్చు.. ఇంకో సగం వేరే వాళ్ళు ఉంటారన్నాడు. అలా చేసుకుంటే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. దీంతో రాము అపార్టుమెంట్ షేర్ అంటూ ఒక యాడ్ రెడీ చేసి ఆన్‌లైన్‌లో ఉంచాడు. అది కూడా కొత్తగా పెళ్ళయినవారైతే ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటారని.. తనకు క్లీన్ చేసుకునే అవసరం ఉండదని భావించి యాడ్ ఇచ్చాడు.
రాము అనుకున్న విధంగా నెలరోజుల క్రితం కొత్తగా పెళ్ళయిన జంట వచ్చింది. వారి పేర్లు విజయ్, ప్రభ. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న విజయ్ హైదరాబాదులో ఇంటి అద్దె కట్టలేక ఫ్లాట్ షేర్ కోసమే చూసేవాడు. రాము ఇచ్చిన యాడ్‌తో నేరుగా అతన్ని సంప్రదించి రెండు నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. మరుసటి రోజే ఇంటిలో చేరాడు.
రాము ఫ్లాట్ షేర్ విషయాన్ని మధుకు చెప్పాడు. కొత్త జంట వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కుటుంబసభ్యుల్లాగా ఉన్నారని.. అంతా హ్యాపీ అంటూ ఫోన్ పెట్టేశాడు. ఆ తరువాత నుంచి రాముకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. విజయ్, ప్రభలు ఇద్దరూ ఏకాంతంగా కలిసి ఉన్న దృశ్యాలను ఒకరోజు చూశాడు. దీంతో రాముకు తెలియని కోరిక మొదలైంది.
విజయ్ ఉద్యోగానికి వెళ్ళిందే ప్రభతో చనువుగా మెలగడం ప్రారంభించాడు. ఆమెకు బాగా దగ్గరయ్యాడు. రామును ప్రభ కూడా దూరం చేసుకోలేదు. అతనికి బాగా దగ్గరైంది. ఒకరోజు ఇద్దరు సన్నిహితమయ్యారు. ఇది చూశాడు విజయ్. ఆగ్రహంతో ఊగిపోయాడు. నా భార్యనే లొంగదీసుకుంటావా అంటూ కొట్టాడు. పోలీసులకు ఫోన్ చేస్తానంటూ బెదిరించాడు.
దీంతో భయపడిపోయిన రాము పోలీసులకు చెప్పొద్దు.. క్షమించండి. మీరు ఏం చెబితే అది చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ అతన్ని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. అతని అకౌంట్‌లోని డబ్బులతో పాటు రాము చైన్లు, ఉంగరాలు అన్నీ తీసుకుని భార్యను వెంటేసుకుని వెళ్లిపోయాడు.
మొత్తం 2 లక్షల రూపాయల నగదుతో పాటు లక్షన్నరకు పైగా నగలను భార్యాభర్తలు ఎత్తుకెళ్ళారు. వారంరోజుల పాటు భయంతో వణికిపోయాడు రాము. అయితే రాము మరో స్నేహితుడు సతీష్ బైక్ మిస్సయ్యింది. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి రామును కూడా వెంట తీసుకెళ్ళాడు. పోలీస్టేషన్లో విజయ్, ప్రభల ఫోటోలను చూసిన రాము నివ్వెరపోయాడు.
తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయ్, ప్రభలు యువకులను మోసం చేసి వారి నుంచి డబ్బులను తీసుకుని ఉడాయించే ముఠా అని పోలీసుల ద్వారా తెలుసుకుని రాము లబోదిబోమన్నాడు. నిందితుల కోసం రామాంతపూర్ పోలీసులు గాలిస్తున్నారు.