Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కొవిడ్‌ తగ్గుముఖం, గత 18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు

Webdunia
బుధవారం, 19 మే 2021 (18:07 IST)
రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ నివేదిక విడుదల చేసింది. ఈ నెల 1 నుంచి 18 వరకు కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు 4.17 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. గడిచిన 18 రోజుల్లో కోలుకున్నవారి శాతం 81.57 నుంచి 90.48 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించింది.
 
* ఈ నెలలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిన విధానాన్ని కూడా వైద్య, ఆరోగ్య శాఖ ఆ నివేదికలో వివరించింది. ఈనెల 1న 7,430 కొత్త కేసులు నమోదైతే.. 18న 3,982 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.
 
* మార్చి 1న 9.73 శాతం పాజిటివ్‌ రేటు నమోదవగా.. ఈ నెల 18న 5.56 శాతానికి తగ్గింది.
 
* ఇందులోనూ తొలివారం గడిచేసరికి 8.69 శాతానికి తగ్గగా రెండోవారం ముగిసే సరికి 7.22 శాతానికి తగ్గుముఖం పట్టింది.
 
* గతేడాది సెప్టెంబరు 3 నాటికి 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స అందగా ప్రస్తుతం వాటి సంఖ్య 112కు పెరిగింది. ప్రభుత్వ వైద్యంలో పడకలు కూడా 8,052 నుంచి 15,297కు పెరిగాయి. అలాగే గత సెప్టెంబరు 3 నాటికి 194 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందగా.. ప్రస్తుతం 1,153 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ చికిత్స చేస్తున్నారు. ప్రైవేటులో పడకల సంఖ్యను కూడా 10,180 నుంచి 38,459కు పెంచారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments