Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండు మూడు రోజుల్లోనే టెన్త్ పరీక్షలు.. గ్రేడ్లను అలా..?

Advertiesment
Telangana SSC Result 2021
, మంగళవారం, 18 మే 2021 (20:52 IST)
తెలంగాణలో టెన్త్ రిజల్ట్ మరో రెండు మూడు రోజుల్లోనే వెలువడే అవకాశాలున్నాయి. కరోనా వ్యాప్తితో వరుసగా రెండోవ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు రద్దు చేయడంతో.. ఫార్మేటివ్ అసెస్ మెంట్ (FA-1) ఆధారంగా గ్రేడ్లను కేటాయిస్తున్నారు. 
 
పరీక్ష ఫీజు చెల్లించిన 5లక్షల 21వేల 398 మంది ఫలితాలు రెండు మూడు రోజుల్లో రానున్నాయి. వీరిలో సుమారు 2లక్షల మంది 10/10 జీపీఏతో ఉత్తీర్ణుడు కానున్నారని సమాచారం. అంటే గతేడాది కంటే దాదాపు 60వేలు ఎక్కువ
మంది ఉన్నారు. కరోనా కారణంగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. 
 
అయితే ఈసారి పదో తరగతి పరీక్షలు లేకున్నా విద్యార్థులకు హాల్‌ టికెట్‌ నంబర్లను కేటాయించారు. ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌(ఎఫ్ఏ-1) మార్కుల ఆధారంగా వార్షిక పరీక్షల మార్కులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కుల మెమోలో హాల్‌టికెట్‌ నంబర్‌ను కూడా నమోదు చేస్తారు. 
 
కాగా.. గతేడాది నాలుగు ఎఫ్‌ఏ పరీక్షల సగటు ఆధారంగా టెన్త్‌ ఫలితాలు ప్రకటించారు. ఈసారి మాత్రం ఒక్క ఎఫ్‌ఏ ఆధారంగానే వార్షిక పరీక్ష మార్కులు కేటాయించనున్నారు. ఫలితాలు ప్రకటించాక.. నెలాఖరులోగా మెమోలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వన్ టైమ్ ఆఫర్ కింద ఉచిత రీచార్జ్ : వొడాఫోన్ ప్రకటన