Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (16:51 IST)
తెలంగాణ రైతుల పట్ల కేంద్రం ఎట్టకేలకు కరుణించింది. ధాన్యం కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే అధికంగా సేకరిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే, ఆ మాటలను లిఖత పూర్వకంగా ఇవ్వాలంటూ ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం పట్టుబట్టింది. 
 
ఈ నేపథ్యంలో ఖరీప్‌సు సంబంధించి తెలంగాణా రాష్ట్రంలోని పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం స్పంష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం నుంచి తెలంగాణ పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ రాసింది. తెలంగాణాలో ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణ లక్ష్యం పెంచినట్టు పేర్కొంది. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబరు 20వ తేదీన రాసిన లేఖపై కేంద్రం స్పందిస్తూ ఈ మేరకు పచ్చజెండా ఊపింది. బియ్యం సేకరణ లక్ష్యం పెంపుదలకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ఆ లేఖలో పెట్టింది. ఈ క్రమంలో తాజాగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments