శంషాబాద్ విమానాశ్రయంలో 1190 గ్రాముల బంగారాన్ని తరలించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు బంగారాన్ని తన మలద్వారం వుంచి అక్రమంగా తరలించాలనుకున్నాడు. కానీ శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాధికారులకు చిక్కాడు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్ నుంచి వస్తున్న క్రమంలో 1,190 గ్రాముల బంగారాన్ని కరిగించి ముద్ద చేసి మలద్వారంలో పెట్టుకొని ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీస్‌లో ఎక్కి శంషాబాద్‌లో దిగాడు.
ప్రయాణికుడి ప్రవర్తనపై భద్రతాధికారులకు అనుమానం రావడంతో విచారించగా.. రూ.59.23 లక్షల విలువైన బంగారం తరలింపు గుట్టురట్టయింది. ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.
ఇకపోతే.. ఈ నెల 11న నలుగురు విదేశీ ప్రయాణికులు మలద్వారంలో 7.3 కిలోల బంగారం తీసుకొచ్చి శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే.