Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమ‌ల వెళుతున్నారా? గదుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు!

తిరుమ‌ల వెళుతున్నారా? గదుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు!
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 28 డిశెంబరు 2021 (10:38 IST)
శ్రీ‌వారి దర్శనానికి విచ్చేసే సామాన్య భ‌క్తుల‌ వ‌స‌తికి పెద్దపీట వేస్తూ, తిరుమ‌ల‌లోని అన్ని గ‌దుల‌ను క‌రెంటు బుకింగ్ ద్వారా కేటాయించాల‌ని నిర్ణయించారు. జ‌న‌వ‌రి 11 నుంచి 14 వ‌ర‌కు వ‌స‌తి గ‌దుల ఆడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్‌ను ర‌ద్దు చేశారు. శ్రీ‌వారి దర్శనానికి విచ్చేసే సామాన్య భ‌క్తుల‌ వ‌స‌తికి పెద్దపీట వేస్తూ తిరుమ‌ల‌లోని అన్ని గ‌దుల‌ను క‌రెంటు బుకింగ్ ద్వారా కేటాయించాల‌ని నిర్ణయించారు. 
 
 
జ‌న‌వ‌రి 11 నుంచి 14వ తేదీ వరకు దాతల‌కు గదుల‌ కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు. ఇక తల‌నీలాలు తీసేందుకు తగినంత మంది క్షురకుల‌ను అందుబాటులో ఉంచారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ క్షురకులు పీపీఈ కిట్లు వినియోగిస్తారు. అన్నప్రసాద భవనంలో కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ, ఈ 10 రోజుల‌ పాటు ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటల‌ వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. భక్తుల‌కు వైద్య సేవ‌లందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయి.
 
 
తిరుమల‌లో పోలీసుల‌తో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వాహనాలు పార్కింగ్‌ ప్రాంతాల‌కు చేరేలా ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలు: కొవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఒమిక్రాన్‌ దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీచేశాయి. అదే విధంగా, కొన్ని పట్టణాల్లో రాత్రి క‌ర్ఫ్యూ కూడా విధించారు.
 
 
ఈ నేప‌థ్యంలో భ‌క్తులు పర్వదినాల్లోనే కాకుండా మిగతా అన్ని రోజుల్లోనూ వ్యాక్సినేష‌న్ సర్టిఫికెట్ గానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్‌ గానీ తప్పనిసరిగా తీసుకురావాలి. తితిదే సిబ్బంది, వేలాది మంది భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు తితిదే విజిలెన్స్‌, సెక్యూరిటీ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో ఒమిక్రాన్ విజృంభణ: కొత్తగా 12 కేసులు