Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 10 మందికి ఒమిక్రాన్ పాజిటివ్

Advertiesment
Telangana
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతుంది. ఎట్ రిస్క్ దేశాలే కాదు.. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో కూడా ఈ వైరస్ కనిపిస్తుంది. తాజాగా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో 10 మందికి ఈ ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. వీరిని కలిసిన వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. దీంతో తెలంగాణా రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 55కి చేరింది. సోమవారం ఒక్క రోజే ఏకంగా 12 కేసులు నమోదు కావడం గమనార్హం. మొత్తం 55 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 10 మంది కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన మీడియా బులిటెన్ ప్రకారం మొత్తం 37,839 శాంపిల్స్ పరీక్షించగా, 182 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 90 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్‌లో 11 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ‌న‌వ‌రి 3 నుంచి స్కూళ్ల‌లో వ్యాక్సినేష‌న్ డ్రైవ్