అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

సెల్వి
గురువారం, 13 నవంబరు 2025 (12:13 IST)
ప్రముఖ టెక్ సంస్థ అమెజాన్ వెబ్ సర్విసెస్‌ భాగస్వామ్యంతో త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

ఈ అత్యాధునిక చాట్‌బాట్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా భక్తులు శ్రీవారి దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు ఇతర సేవలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు. 
 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌలభ్యం కోసం ఈ సేవలను ఏకంగా 13 భాషల్లో అందించనున్నారు. అంతేకాకుండా, భక్తులు తమ ఫిర్యాదులను, సలహాలు, సూచనలను కూడా ఈ చాట్‌బాట్‌ ద్వారా సులభంగా టీటీడీ దృష్టికి తీసుకెళ్లే వెసులుబాటు కల్పించనున్నారు. 
 
ఈ చాట్‌బాట్‌లో స్పీచ్ టు టెక్ట్స్, టెక్ట్స్ టు స్పీచ్ వంటి ఆధునిక సదుపాయాలు కూడా ఉండనున్నాయి. దీనివల్ల భక్తులు వాయిస్ కమాండ్ల ద్వారా కూడా సమాచారాన్ని పొందగలరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వారణాసి గంగా ఘాట్‌లో మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన, గంగలో దూకేశాడు, వీడియో

భార్య నుంచి విడాకులు వచ్చినందుకు గుడికి 9 కి.మీ వెళ్తూ భర్త పొర్లుదండాలు, వీడియో

రెండో పెళ్ళి చేసుకుని భర్త వేధింపులు... ఇద్దరు పిల్లలను చంపి తాను ఉరేసుకున్న భార్య

దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ - ఏప్రిల్ 14న అందుబాటులోకి...

బందరులో ఓ బఫూన్ ఉన్నాడు : మంత్రి కొల్లు రవీంద్ర

అన్నీ చూడండి

లేటెస్ట్

28-03-2026 శనివారం ఫలితాలు - మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు

Ontimitta : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

తర్వాతి కథనం
Show comments