13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

రామన్
గురువారం, 13 నవంబరు 2025 (05:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచించేస్తుంది. పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
చాకచక్యంగా అడుగులేస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. ఆప్తులకు కీలక సమాచారం అందిస్తారు. ఖర్చులు సామాన్యం, పనులు వేగవంతమవుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. సందేశాలు అందుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
శ్రమించినా ఫలితం ఉండదు. కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం.  సంప్రదింపులు ముందుకు సాగవు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ముఖ్యమైన అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులకు మరింత చేరువవుతారు. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఆపన్నులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పత్రాల సవరణలు అనుకూలిస్తాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వేడుకను ఘనంగా చేస్తారు. ఆర్భాటాలకు ధనం వ్యయం చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. మీ చోద్యం అనివార్యం. ఇతరులతో మితంగా సంభాషించండి. ప్రయాణం విరమించుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. కష్టమనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఆదాయం వుంది. చెల్లింపులు జరుపుతారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మాట నిలబెట్టుకుంటారు. మీ చిత్తశుద్ధి ఇతరులను ఆకట్టుకుంటుంది. పురస్కారాలు అందుకుంటారు. ఆడంబరాలకు వ్యయం చేస్తారు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. ప్రయాణం తలపెడతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్ధికలావాదేవీలతో తీరిక ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. సోదరులు వైఖరి అసహనం కలిగిస్తుంది. పెద్దల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పత్రాలు అందుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. ప్రముఖలతో పరచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kurnool: కర్నూలు బస్సు ప్రమాదం వీడిన మిస్టరీ.. వెలుగులోకి షాకింగ్ వీడియో

అరకు లోయ ఆస్పత్రిలో రోగుల సెల్ ఫోన్లు కొట్టేసిన వ్యక్తి-వీడియో వైరల్

నాగుపాము పిల్లపై బైక్ పోనిచ్చాడు, చటుక్కున కాటేసింది (video)

కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

నమో అంటే నరేంద్ర మోదీ మాత్రమే కాదు.. చంద్రబాబు నాయుడు కూడా: నారా లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దివ్య ఆశీస్సులతో అన్నప్రసాదానికి ఆధునిక వంటశాల: ముకేష్ అంబాని

Non Veg Food Near Alipiri: అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నారు.. ఇద్దరు ఉద్యోగులు అవుట్

10-11-2025 సోమవారం ఫలితాలు - కొత్త వ్యక్తులతో జాగ్రత్త

09-11-2025 నుంచి 15-11-2025 వరకూ మీ రాశి ఫలితాలు

08-11-20 శనివారం ఫలితాలు - మీ కష్టం మరొకరికి లాభిస్తుంది

తర్వాతి కథనం
Show comments