మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రుణ సమస్య పరిష్కారమవుతుంది. సంతోషంగా గడుపుతారు. ఖర్చులు అధికం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
వృషభం: కృత్తిక 2, 18, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 1, పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్తగా హాజరవుతారు. బెట్టింగ్‌కు పాల్పడవద్దు.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 13 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. ధనలాధం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్నమస్యలుగా గడుపుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఓర్పుతో యత్నాలు కొనసాగిస్తారు, పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారం అనుకూలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. మీ చొరవతో ఒకరికి నుంచి జరుగుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు. పనులు సానుకూలంగా జరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ప్రయాణం తలపెడతారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. సంయమనంగా మెలగండి. అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
చావాదేవీలతో తీరిక ఉండదు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనులు చురుకుగా సాగుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సర్వత్రా అనుకూలమే. కలుపుగోలుగా మెలుగుతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వస్తుప్రాప్తి పొందుతారు. ఖర్చులు అధికం. ఆత్మీయులను విందుకు ఆహ్వానిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారి నుంచి సాయం అందుతుంది. అశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. విలాసాలకు ఖర్చు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. భేషజాలకు పోవద్దు. సన్నిహితుల సలహా తీసుకోండి. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కొటారు.
మకరం : ఉత్తర 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట, 1, 2 పాదాలు
ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. కొందరి వ జబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పిల్లల దూకుడు అసహనం కలిగిస్తుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. మీ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఆప్తులకు ఖరీదైన కానుకలిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. కొత్త ప్రదేశం సందర్శిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. ఆర్ధిక విషయాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. ఖర్చులు అధికం. ప్రముఖల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పనులు ముందుకు సాగవు, ఆర్థిక విషయాలు ఇతరులకు వెల్లడించవద్దు.