Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-11-2025 బుధవారం ఫలితాలు - ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి

Advertiesment
Astrology

రామన్

, గురువారం, 6 నవంబరు 2025 (05:05 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఉత్సాహంగా గడుపుతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనుల్లో శ్రమ అధికం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. రావలసిన ధనం సమయానికి అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పనులు ఇతరులకు పురమాయించవద్దు. ప్రయాణం తలపెడతారు.
 
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధుమిత్రుల ఆహ్వానం అందుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ తప్పిదాలు సరిదిద్దుకోవటం ముఖ్యం. ఖర్చులు సామాన్యం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు.
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. పరిచయాలు బలపడతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మీ సమర్థతపై ఎదుటి వారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. 
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యం నెరవేరుతుంది. ఆందోళన తగ్గి స్థిమితపడకొత్త యత్నాలు ప్రారంభిస్తారు. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పసులు సానుకూలమవుతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు, ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహాన్నిస్తాయి. ఖర్చులు సామాన్యం. పనులు వేగవంతమవుతాయి, ఉల్లాసంగా గడుపుతారు. అప్రియమైన వార్తలు వింటారు. కార్యక్రమాలు సాగవు, ప్రయాణం చేయవలసివస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. పనులకు ప్రణాళికలు రూపొందించుకుంటారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్త సమస్య ఎదురవుతుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. సన్నిహితులతో సంభాషిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు సాగవు, ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. పత్రాలు అందుకుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు:
కష్టం ఫలిస్తుంది. ఉత్సాహంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పత్రాలు అందుకుంటారు. పోగొట్టుక్ను వస్తువులు లభ్యమవుతాయి. ద్విచక్ర వాహనదారులకు దూకుడు తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ధనలాభం ఉంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. నోటీసులు అందుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు సేవాసంస్థలకు విరాళాలందిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూతకంలో శుభకార్యానికి వెళ్లవచ్చా?