మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంకల్పం సిద్ధిస్తుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. కీలక వ్యవహారంలో ఏరాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఖర్చులు విపరీతం వేడుకను ఘనంగా చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాహనసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త ప్రలోభాలకు లొంగవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు అధికం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టపడినా ఫలితం ఉండదు. బంధుమిత్రులతో విబేధిస్తారు. ప్రతి వ్యవహారం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. నిస్తేజానికి లోనవుతారు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. కొందరి మాటలు కష్టమనిపిస్తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. నోటీసులు అందుకుంటారు. దుబారా ఖర్చులు అధికం. బెట్టింగలకు పాల్పడవద్దు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ నమ్మకం వమ్ముకాదు. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రముఖులు సందర్శనం వీలుపడదు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంతోషకరమైన వార్త వింటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాలు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. అవసరమైన వస్తువులు సమయానికి కనిపించవు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆలయాలకు విరాళాలు అందిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతి విషయంలోను మీదే పైచేయి. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పరిచయాలు పెరుగుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. తగిన నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. వేడుకను అట్టహాసంగా చేస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మీ శ్రీమతి ధోరణి అసహనం కలిగిస్తుంది. పత్రాలు అందుతాలు.. ప్రయాణం తలపెడతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ఖర్చులు సామాన్యం, ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు, వేడుకకు హాజరవుతారు. ప్రయాణంలో జాగ్రత్త
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేయగలుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.