Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Non Veg Food Near Alipiri: అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నారు.. ఇద్దరు ఉద్యోగులు అవుట్

Advertiesment
Tirumala

సెల్వి

, సోమవారం, 10 నవంబరు 2025 (11:45 IST)
Tirumala
అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నారనే ఆరోపణలతో ఇద్దరు అవుట్‌సోర్స్ ఉద్యోగులను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తొలగించింది. ఈ విషయంలో తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నందుకు ఇద్దరు అవుట్‌సోర్స్ ఉద్యోగులు రామస్వామి, సరసమ్మపై టిటిడి కఠిన చర్యలు తీసుకుందని ఆలయ సంస్థ అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 114 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
 
మరోవైపు, తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. టీటీడీ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మెట్లమార్గంలో ఒకచోట కూర్చొని భోజనం చేస్తున్నారు. వారి లంచ్ బాక్సుల్లో తీసుకొచ్చిన మాంసాహార భోజనం తింటున్నారు. 
 
ఈ విషయాన్ని అటువైపుగా వెళుతున్న భక్తులు కొందరు గుర్తించారు.. పవిత్రమైన తిరుమల చెంత మాంసాహారం ఎందుకు తింటున్నారని ప్రశ్నించారు. శ్రీవారి భక్తులు ఈ అంశంపై వెంటనే టీటీడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.. ఈ తతంగాన్ని వీడియో తీశారు. ఈ వీడియో వైరల్ కావడంతో తితితే అధికారులు విధుల నుంచి తొలగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-11-2025 సోమవారం ఫలితాలు - కొత్త వ్యక్తులతో జాగ్రత్త