తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి కేసు రోజురోజుకీ మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. తాజాగా తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కూడా నోటీసు ఇచ్చింది. దర్యాప్తు అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని వైవీకి నోటీసులు ఇచ్చింది. కాగా ఇప్పటికే ఈ కేసులో 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో A16గా వున్న అజయ్ కుమార్ ను సిట్ అరెస్ట్ చేసింది.
గత వైసిపి ప్రభుత్వంలో తిరుమల లడ్డూల్లో కల్తీ వ్యవహారంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. అప్పట్లో భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ సంస్థ నుంచి తితిదేకి 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ నిర్థారించింది. ఈ నెయ్యిలో పామాయిల్ ఇతర నూనెలను 57.56 లక్షల కిలోల మేరకు కల్తీ జరిగినట్లు అధికారులు తేల్చారు.