Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బాధలకు అత్త, భర్త కారణమంటే? ఎలా..?

ఆధ్యాత్మికంగా ఉండటమంటే ''నా ఆనందానికి నేనే మూలం'' అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. మీ ఆనందానికి మరెవరో మూలమని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు. దీంతో ఆనందం కోసం మీరెప్పుడూ వారిపై ఆధారపడి ఉంటారు. మీ ఆనందానిక

Sadhguru Jaggi Vasudev
Webdunia
గురువారం, 1 మార్చి 2018 (14:43 IST)
ఆధ్యాత్మికంగా ఉండటమంటే ''నా ఆనందానికి నేనే మూలం'' అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. మీ ఆనందానికి మరెవరో మూలమని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు. దీంతో ఆనందం కోసం మీరెప్పుడూ వారిపై ఆధారపడి ఉంటారు. మీ ఆనందానికి మీరే మూలమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆనందంగా వుండొచ్చు. 
 
అసలు మీలోని జీవం ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటుంది. మీ జీవితాన్నే చూస్తే, మీరు చదువుకుంటారు, డబ్బు, ఇల్లు, ఓ కుటుంబం, పిల్లలు కావాలనుకుంటారు. ఏదో ఒక రోజున అవన్నీ మీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయని మీరు వీటన్నిటినీ కావాలనుకుంటున్నారు. ఇప్పుడు మీ వద్ద అవన్నీ ఉన్నాయి, కానీ మీరు ఆనందమనే విషయం మరిచిపోయారు.
 
ప్రజలు బాధలలో ఉండడానికి కారణం వారు జీవితాన్ని అపార్థం చేసుకోవడమే. ''లేదు.. నా భర్త, నా భార్య లేదా మా అత్త'' నా బాధలకు కారణం అని మీరు అనవచ్చు. వాళ్ళందరూ ఎలా ఉన్నప్పటికీ, దుఃఖంగా ఉండడాన్ని మీరే ఎంచుకున్నారు. దుఃఖంలో పెట్టుబడి పెట్టింది మీరే. దుఃఖంగా ఉండడంవల్ల ఏదో ఒరుగుతుందని మీరనుకుంటున్నారు.
 
ఉదాహరణకి, మీ కుటుంబంలో ఒకరు మీరు చేయకూడదనుకున్న దానిని చేయడం మొదలుపెడతారు. మిమ్మల్ని మీరు దుఃఖపెట్టుకుని, వారు మారుతారేమో అని ఆశిస్తూ, ఏడుపు మొహంతో తిరుగుతారు. వారు మారాలనే ఉద్దేశంతో మీకు మీరే దుఃఖం కలిగించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అలా మీరు దుఃఖంతో ఉంటే, మీ చేతిలో స్వర్గమున్నా కూడా ఏం లాభం? 
 
అదే మీరొక ఆనందమయ వ్యక్తి అయినట్లైతే, మీ చేతిలో ఏది ఉన్నా, లేకపోయినా, ఎవరు పట్టించుకుంటారు?  మీరు నిజంగా ఆనందంగా ఉంటే, మీ దగ్గర ఏముంది, ఏం లేదు, ఎవరున్నారు, ఎవరు లేరు అన్న విషయాలు అంత ముఖ్యమైనవి అవుతాయా? దయచేసి అర్థం చేసుకోండి. మీరు శ్రద్ధ చూపించడం, ప్రేమించడం, అదో ఇదో కావాలనుకోడం, ఇవన్నీ మీరు చేస్తున్నది అవి మీకేదో ఆనందాన్ని తెచ్చిపెడతాయన్న ఆశతోనే కదా?
 
చాలామంది ఎప్పుడూ నన్ను ఈ ప్రశ్న అడుగుతుంటారు, ''ఆధ్యాత్మికవాదికి, భౌతికవాదికి తేడా ఏమిటి?" అని. వాళ్ళకు నేను ''ఒక భౌతికవాది కేవలం తన ఆహారాన్ని మాత్రమే సంపాదించుకుంటాడు. మిగిలిన అన్నిటిని – ఆనందం, శాంతి, ప్రేమ – వీటన్నిటిని అతను అర్థిస్తాడు. ఒక ఆధ్యాత్మికవాది ప్రేమ, శాంతి, ఆనందం, అన్నీ తనే సంపాదించుకుంటాడు. అతను కేవలం ఆహారాన్ని మాత్రమే అర్థిస్తాడు. కావాలనుకుంటే దాన్ని కూడా సంపాదించుకోగలడు' అని చమత్కారంగా బదులిస్తాను-సద్గురు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Fishermen Aid: మత్స్యకర చేయూత పథకం ప్రారంభం.. చేపల వెళ్లకపోయినా..?

IED attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్: 10 మంది సైనికులు హతం.. వీడియో వైరల్

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments