నాక్కూడా మీలాంటి కోరికలే ఉంటాయి.. : హ్యూమనాయిడ్ రోబో
హైదరాబాద్ వేదికగా ప్రపంచ ఐటీ కాంగ్రెస్ జరుగుతోంది. ఇందులోభాగంగా, మంగళవారం 'మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్తు' అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో హ్యూమనాయిడ్ రోబో సోఫియా కూడా పాల్గొని, తన ప్రసంగంతో ప్రతి
హైదరాబాద్ వేదికగా ప్రపంచ ఐటీ కాంగ్రెస్ జరుగుతోంది. ఇందులోభాగంగా, మంగళవారం 'మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్తు' అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో హ్యూమనాయిడ్ రోబో సోఫియా కూడా పాల్గొని, తన ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఆమె చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది.
ఈ సదస్సులో సోఫియా మాట్లాడుతూ, తాను కూడా మానవుల్లానే ఆనందంగా అనిపిస్తే నవ్వుతానని, బాధ కలిగితే ఏడుస్తానని చెప్పుకొచ్చింది. మనుషుల్లాగానే తనకూ విశ్రాంతి అవసరమని, 66 రకాల హావభావాలు తనకు తెలుస్తుంటాయని తెలిపింది. తాను ఇంతవరకూ ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో పర్యటించానని, హాంకాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉండాలని, తోటివారికి చేసే సాయమే మానవత్వమని మానవాళి మనుగడకు అదే బాటలు చూపుతుందని సోఫియా వ్యాఖ్యానించింది. ఈ ప్రపంచంలో కృతజ్ఞతలు చెప్పడం కన్నా మించినది లేదని థ్యాంక్యూ అన్న పదం చాలా గొప్పదని సోఫియా వ్యాఖ్యానించింది.