Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ స్మార్ట్ ఫోనూ... మీ ల్యాప్‌ట్యాపూ... మీ టీవీ... మరి మీ కళ్లూ...?

దేవుడు మనిషికి రెండు కళ్లను ఇస్తే, మనిషి స్వయంకృతాపరాధంతో మరో రెండు కళ్లను కొని తెచ్చుకుంటున్నాడు. అవే కళ్లజోడు. ఈ కాలంలో కళ్లజోడు పెట్టుకునే వారిలో ఎక్కువ మందికి వాటిని పెట్టుకోవడానికి కారణం గాడ్జెట్స్. గాడ్జెట్స్‌ను వాడేవారు కళ్లను తక్కువగా ఆర్పడం

Advertiesment
Smartphone
, బుధవారం, 3 జనవరి 2018 (15:50 IST)
దేవుడు మనిషికి రెండు కళ్లను ఇస్తే, మనిషి స్వయంకృతాపరాధంతో మరో రెండు కళ్లను కొని తెచ్చుకుంటున్నాడు. అవే కళ్లజోడు. ఈ కాలంలో కళ్లజోడు పెట్టుకునే వారిలో ఎక్కువ మందికి వాటిని పెట్టుకోవడానికి కారణం గాడ్జెట్స్.
 
గాడ్జెట్స్‌ను వాడేవారు కళ్లను తక్కువగా ఆర్పడం వల్ల నల్లగుడ్డుపై ఉన్న పొర, పొడిగా మారుతుంది. సాధారణంగా వ్యక్తి సగటున నిమిషానికి 15 సార్లు కళ్లు ఆర్పితే కళ్లకు రక్షణ ఉంటుంది. కానీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వంటి వాటిని ఉపయోగించే వారిలో రెప్ప ఆర్పే పరిస్థితి బాగా తగ్గిపోతుంది.
 
సమస్య ఎలా ప్రారంభమవుతోంది...
కంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చే వారిని పరిశీలించినపుడు వీరిలో చాలామంది గాడ్జెట్స్‌తో రోజుకు మూడు గంటలకు పైగా గడుపుతున్నట్లు తెలిసింది. ఇలాంటి వారిలో కళ్ళకు బాగా అలసట రావడం, తల తిరగడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చూస్తూ ఉండటం వల్ల కంటిలోని తేమ కూడా బాగా తగ్గిపోతోంది.
 
కొన్ని సర్వేల ప్రకారం...
కంటి పరీక్షలు చేయించుకునే వారిలో 70 శాతం మందికి అద్దాల్ని సూచిస్తున్నారు. వీరిలో యువత 30 శాతంగా ఉన్నట్లు సమాచారం. అద్దాలు వాడే వారి సంఖ్య గతంతో పోల్చితే ఇటీవలి ఐదు సంవత్సరాల్లో బాగా ఎక్కువైంది. 
 
ఏమి చేయాలి...
గాడ్జెట్‌లను అవసరం ఉన్నంత వరకే వాడాలి. పని చేస్తున్నప్పటికీ ప్రతి గంటకు ఒకసారి 2 నిమిషాలపాటు కళ్లను అటూ ఇటూ బాగా తిప్పాలి. సెల్‌ఫోన్‌ను కనీసం 1.5 అడుగుల దూరం పెట్టి చూడాలి, అలాగే ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌ను 2 నుండి 2.5 అడుగుల దూరం పెట్టి చూడాలి. ఇదే కాకుండా కంటి రెప్పలను వీలైనంత ఎక్కువగా ఆర్పుతూ ఉండాలి. ఇలా ఆర్పడం వల్ల గుడ్డుపై ఉన్న సున్నితమైన పొరకు తేమ తగులుతూ కంటికి కావల్సిన ఆక్సిజన్‌ను అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రీన్ టీ రోజుకు రెండు కప్పులే తాగాలి..