భూతం అతడి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంది

Webdunia
గురువారం, 29 జులై 2021 (23:32 IST)
భగవంతుని ఇంటి తలుపులకు ఎదురుగా ఈ అహంకారమనేది చెట్టు బోదెలా పడి ఉంది. ఈ బోదెను దాటకుండా ఆయన ఇంట్లో ప్రవేశించడం సాధ్యం కాదు. ఒకప్పుడు ఒకడు భూతాలను లొంగదీసుకొనే శక్తి గడించాడు. ఆ శక్తి కలిగాక అతడు పిలవగానే భూతం అతడి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంది. 
 
నేనిప్పుడు ఏం పని చేయాలో చెప్పు. నువ్వు నాకు ఏ పని అప్పగించనట్లయితే ఆ మరుక్షణమే నీ మెడను త్రుంచి వేస్తాను అని హెచ్చరించింది. దాంతో ఆ వ్యక్తి తనకు కావలసిన పనులన్నింటిని ఆ భూతం ద్వారా ఒక్కొక్కటిగా చేయించుకున్నాడు. చివరకు ఆ భూతానికి ఇవ్వడానికంటూ అతడి వద్ద ఏ పని లేకుండా పోయింది, ఇప్పుడు నీ మెడ త్రుంచి వేస్తాను అంది ఆ భూతం.
 
పాపం అప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. ఒక్కక్షణం ఆగు. నేనిప్పుడే వస్తాను అని చెప్పి అతడు తన గురువు వద్దకు పరుగుపరుగున వెళ్లాడు. ఆయనకు ఈ ఉదంతాన్ని తెలిపి అయ్యా.... నేనొక పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాను. నేను ఇందులో నుండి బయటపడటం ఎలాగో సెలవియ్యండి అన్నాడు. 
 
గురువుగారు అతనికి వంకరటింకరగా ఉన్న వెంట్రుకను ఒకదానిని ఇచ్చారు. దానిని ఆ భూతానికి ఇచ్చి తిన్నగా చెయ్యమని చెప్పమన్నారు. ఆ భూతం రాత్రింబవళ్లు ఆ వెంట్రుకను తిన్నగా చెయ్యడంలోనే నిమగ్నమయ్యింది. కానీ ఆ వెంట్రుక ఎప్పటికైనా తిన్నగా అయ్యేదేనా... అది ఎలా వంకరగా ఉండేదో అలాగే ఉంది. అహంకారం కూడా అలాంటిదే. క్షణంలో తొలగిపోయినట్లు ఉంటుంది. మళ్లీ అంతలోనే ప్రత్యక్షమవుతుంది. అహంకారాన్ని త్యజించకుండా భగవత్కృప లభించదు. మనలోని అహాన్ని తొలగించుకున్నట్లయితే భగవంతుని సానిధ్యం తప్పక లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్తతో కన్నపిల్లల్ని నా దగ్గర వద్దన్న ప్రియుడు, ఆత్మహత్య చేసుకున్న వివాహిత

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక దారుణ హత్య - సీఎం చంద్రబాబు ఫోనులో పరామర్శ

ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్న హైస్కూల్ ఉద్యోగిని

నన్ను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తావా? మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

ఆ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను తిరిగి పునరుద్ధరించిన రైల్వే శాఖ

అన్నీ చూడండి

లేటెస్ట్

Srisailam: శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు.. భద్రత కట్టుదిట్టం

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

తర్వాతి కథనం
Show comments