క్రికెట్ ప్రేమికుల రెండేళ్ల నిరీక్షణకు వరుణ దేవుడు గండి కొట్టినట్టే కనిపిస్తోంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న సౌథాంప్టన్‌లో వచ్చే వారం రోజులూ వర్షం పడే అవకాశం ఉన్నట్లు బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. సౌథాంప్టన్‌లో వచ్చే ఆరు రోజులూ వర్షాలు పడొచ్చంటూ బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
ఈ మేరకు ఎల్లో వెదర్ వార్నింగ్‌ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. సౌథాంప్టన్ మొత్తంగా ఓ మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వచ్చే వారం రోజులూ ఇదే తరహా వాతావరణం సౌథాంప్టన్‌లో ఉండటానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం- 16 డిగ్రీల ఉష్ణోగ్రతతో వర్షం కురుస్తోన్నట్లు తెలిపింది.
సౌథాంప్టన్‌లో ప్రస్తుతం సుమారు అయిదు గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు తెరపి ఇస్తోన్నప్పటికీ.. మేఘాలు పూర్తిగా తొలగిపోలేదు. గంటకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల ఏజెస్ బౌల్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. బురదమయమైంది.