Webdunia - Bharat's app for daily news and videos

Install App

#FactCheck : ఒక్కో బ్యాంకు ఖాతాలో రూ.3 వేలు చొప్పున జమ!!! (video)

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (11:32 IST)
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కలిగించిన నష్టం అంతాఇంతాకాదు. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్రం లాక్డౌన్ అమలు చేసింది. దీంతో అనేక కంపెనీలు మూతపడ్డాయి. ఫలితంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులయ్యారు. ఈ క్రమంలో కరోనా కష్టం నుంచి కేంద్రం ఆదుకోనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరికీ రూ.3 వేల చొప్పున కేంద్రం జమ చేయనుందనే వార్త ప్రస్తుతం యూట్యూబ్‍‌లో చక్కర్లు కొడుతోంది. 
 
'ప్రధాన మంత్రి మాన్‌ధన్ యోజన' కింద అకౌంట్లు ఉన్న వాళ్లందరికీ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు రూ.3,000 చొప్పున జమ చేయనుందని చెబుతున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంత?. ఏమాత్రం నిజం లేదని, అవాస్తవిక కథనమని, ఇలాటి ప్రకటన ఏదీ కేంద్రం చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఒక ట్వీట్‌లో స్పష్టం చేసింది. 
 
ఇందులో 'ప్రధాని మాన్‌ధన్ యోజన కింద అకౌంట్లు ఉన్న వారందరికీ రూ.3000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటూ యూ ట్యూబ్ వీడియో‌ ఒకటి క్లెయిమ్ చేసింది. ఈ క్లెయిమ్‌లో నిజం ఎంతమాత్రం లేదు. ఇదో నకిలీ వార్త. ఇలాంటి ఏ స్కీమ్ కింద కూడా ప్రభుత్వం రూ.3000 చెల్లించడం లేదు' అంటూ పీఐబీ ట్వీట్ చేసింది. 
 
మరోవైపు, ప్రభుత్వం సైతం గతంలో సోషల్ మీడియోలా వస్తున్న నిర్ధారణ కాని వార్తలపై పలుమార్లు వివరణ ఇచ్చింది. నకిలీ వార్తలను ఎవరూ షేర్ చేయవద్దని, ఇలాంటివి షేర్ చేసేటప్పుడు విశ్వసనీయ సమాచారం తీసుకుని, పూర్తిగా నిర్దారణ చేసుకున్న తర్వాతే షేర్ చేయాలని సూచించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments