Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరోన్ ఫించ్‌ను ఆడుకున్న అశ్విన్.. ఔట్ చేస్తానని బంతిని వేయకుండా..?

Advertiesment
అరోన్ ఫించ్‌ను ఆడుకున్న అశ్విన్.. ఔట్ చేస్తానని బంతిని వేయకుండా..?
, మంగళవారం, 6 అక్టోబరు 2020 (11:00 IST)
Aaron Finch_Ashwin
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌ రసవత్తరంగా జరుగుతోంది. రికార్డులతో విజయాలు ఓ వైపు.. పరాజయాలు మరోవైపు అంటూ ఐపీఎల్ సాగుతోంది. అయితే ఐపీఎల్‌లో ఆసక్తికరమైన ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే వున్నాయి. తాజాగా దుబాయ్ వేదికగా సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. 
 
గత సంవత్సరం చేసినట్టుగానే ఈసారి కూడా మన్కడింగ్ చేయడానికి బౌలర్ అశ్విన్ ప్రయత్నించాడు. కానీ అలా ఏమి లేకుండా కేవలం వార్నింగ్‌తో వదిలేశాడు. ఢిల్లీ కేపిటల్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. దీంతో కెమెరాలు అన్ని ఆ బ్యాట్స్‌మెన్ మొఖం వైపునకు తిప్పారు. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
 
అశ్విన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో వేగంగా పరిగెత్తుకు వస్తున్నాడు. అప్పుడు నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న ఆరోన్ ఫించ్, క్రీజ్ దాటి చాలా దూరం వెళ్లిపోయాడు. ఇలా తరుచూ చేస్తుండటంతో దీన్ని గమనించిన అశ్విన్, తన బౌలింగ్‌ను ఆపి ఔట్ చేస్తా అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చాడు. 
 
ఒక్కసారిగా ఫించ్ ఔట్ అయ్యానేమో అని అక్కడే ఊపిరి బిగబట్టి ఆగిపోయాడు. కానీ అశ్విన్ మాత్రం అదేమి పట్టించుకోకుండా అంపైర్ వైపు నవ్వుతూ చూస్తూ స్వీట్ వార్నింగ్‌తో సరిపెట్టేశాడు. కాగా, గతేడాది ఇలాగే రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ మన్కడింగ్ చేసిన అశ్విన్ విమర్శల పాలయ్యాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2020 : ఆధిపత్య పోరులో చతికిలపడిన కోహ్లీ సేన... అగ్రస్థానంలో ఢిల్లీ!