ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ సీజన్‌లో తొలుత ముంబై ఇండియన్స్ జట్టుతో సీఎస్కే జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుపును నమోదు చేసుకుంది. అయితే తదుపరి మూడు మ్యాచ్‌ల్లో చెన్నై హ్యాట్రిక్ ఓటమిని నమోదు చేసుకుందనే చెప్పాలి. అయినా పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ కొత్త రికార్డును సృష్టించాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయకపోయినా.. వికెట్ కీపర్‌గా అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వికెట్ కీపర్‌గా వంద క్యాచ్‌లు సాధించిన ఆటగాడిగా మహీ రికార్డు నెలకొల్పాడు. పంజాబ్ జట్టు కెప్టెన్ రాహుల్ కొట్టిన షాట్‌ను క్యాచ్ పట్టడం ద్వారా ఈ రికార్డును ధోనీ తన ఖాతాలో వేసుకున్నాడు.
తద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ పేరిట వున్న ఈ రికా జాబితాలో ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. ఇది కాకుండా ధోనీ 39 స్టంప్‌లు కూడా పూర్తి చేశాడు. అలాగే ఐపీఎల్ పోటీల్లో అత్యధిక బ్యాటింగ్ రికార్డు కూడా ధోనీ పేరిట వుంది. 193 బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను సాధించిన సురేష్ రైనా రికార్డును ధోనీ అధిగమించాడు. ధోనీ తర్వాతి స్థానంలో 192 మ్యాచ్‌లతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట వుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 180 ఇన్నింగ్స్‌తో మూడో స్థానంలో నిలిచాడు.
ఇకపోతే.. ఐపీఎల్‌లో ఫేవరేట్‌గా దిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఆరంభంలో జరిగిన ముంబై ఇండియన్స్ మ్యాచులో గెలిచినప్పటికీ, ఆ తర్వాత వరుసగా ఓడిపోతూ వచ్చింది. గాయం కారణంగా అంబటి రాయుడు ఇంటికి దూరమవడం, ధోనీ ఏడవ స్థానంలో బ్యాటింగ్‌కి దిగడం మొదలగు కారణాల వల్ల ఓడిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తాయి. ధోనీ ఫిట్‌నెస్‌పై కూడా విమర్శలు వచ్చాయి. ధోనీ పనైపోయిందంట్లూ కామెంట్లు పడ్డాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ మాజీ క్రికెటర్లు సైతం ధోనీ ఆటతీరుని తప్పు బట్టారు.
ఐతే మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా, ధోనీని సమర్థిస్తూ మాట్లాడాడు. క్రికెట్ అనేది టీమ్ ప్లే అనీ, ఒక్కడే ఏమీ చేయలేడని, అందరూ సమానంగా ఎఫర్ట్ పెడితేనే టీమ్ గెలుస్తుందని అంటున్నాడు. మ్యాచులో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ధోనీ ఎప్పుడు ముందుంటాడని, ఈ సీజన్లో అలాగే ప్రయత్నిస్తున్నాడని, కానీ ఒక్కడే ఏమీ చేయలేడని చెప్తున్నాడు. సన్ రైజర్స్‌తో మ్యాచ్ ఓడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడి పది వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది.