ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో 17వ మ్యాచ్ మరికాసేపట్లో దుబాయ్‌లోని షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగనుంది.
ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టుతో వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ ఐపీఎల్‌లో రెండు జట్లు ఇప్పటివరకు ఐదేసీ మ్యాచ్‌లు ఆడి రెండేసి మ్యాచ్‌లలో విజయం సాధించాయి.
పాయింట్ల పరంగా చూస్తే నాలుగేసి పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ.. నెట్ రన్‌రేట్ ఆధారంగా పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ జట్టు మూడో స్థానంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి.
కాగా, ఈ మ్యాచ్, ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఈ క్రమంలో ఇప్పటికే రెండు జట్లు అబుదాబిలోని హోటళ్ల నుంచి షార్జా క్రికెట్ స్టేడియానికి బయలుదేరాయి.
కాగా ఇరు జట్లూ ఇప్పటివరకు 14 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లూ తలా ఏడేసి మ్యాచ్‌లలో విజయం సాధించాయి. గత ఐదు మ్యాచ్‌లలో గెలుపోటములను పరీశీలిస్తే, ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్‌లో గెలుపొందగా, హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్‌లలో గెలుపొందింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.