Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్మిని ఇచ్చి పెళ్లి చేశావేంట్రా..? సుడిగాలి సుధీర్ ప్రశ్న (Video)

Advertiesment
Rashmi Gautam
, శనివారం, 3 అక్టోబరు 2020 (17:03 IST)
బుల్లితెర జబర్దస్త్ లవ్ బర్డ్స్ అంటేనే టక్కున సుడిగాలి సుధీర్‌, యాంకర్ రష్మీ పేర్లే గుర్తుకు వస్తాయి. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోతున్నారని, ఒకరంటే ఒకరు అమితంగా ఇష్టపడుతున్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వరుస కథనాలు వినిపించాయి. వీరి ప్రేమాయణంపై వినిపించని గాసిప్ అంటూ లేదు. బుల్లితెరపై భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న క్రేజీ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరు కలిసి ''సాఫ్ట్‌వేర్ సుధీర్‌''లో నటించాలనుకున్నారు.
 
రష్మీ గౌతమ్ కోసం ప్రొడ్యూసర్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ డేట్స్ లేకపోవడంతో కుదరలేదు. వీరి మధ్య వస్తున్న వార్తల్ని చూడలేక చివరికి జబర్దస్త్ వేదికగా రోజా ఉత్తుత్తి పెళ్లి తంతుని కూడా జరిపించి మురిసిపోయింది. అయితే తాజాగా వీరి పెళ్లి ప్రస్థావన మరో సారి తెరపైకి వచ్చింది. 
 
స్కిట్‌లో భాగంగా సుధీర్ గారడీ రష్మిని ఇచ్చి పెళ్లి చేశావేంట్రా అంటే వెంటనే అందుకున్న రష్మీ పోనీలే సుధీర్ ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరుగుతాయా? నన్ను ఎన్నో సార్లు పెళ్లి చేసుకోవాలని ట్రై చేశావ్ ఆఖరికి దీన్ని పెళ్లి చేసుకున్నావ్'' అని పంచ్ వేయడంతో షోలో వున్న వాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ కలవడానికి 200 కిలోమీటర్లు నడక ప్రయాణం సాగించిన అభిమాని