Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-10-2020 నుంచి 10-10-2020 వరకు మీ వార రాశి ఫలాలు ఎలా వున్నాయంటే (video)

Advertiesment
04-10-2020 నుంచి 10-10-2020 వరకు మీ వార రాశి ఫలాలు ఎలా వున్నాయంటే (video)
, సోమవారం, 5 అక్టోబరు 2020 (12:10 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ప్రతికూలతలెదురవుతాయి. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. మనస్థిమితం ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కొనుగోలుదార్లతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అంచనాలు ఫలిస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. వాగ్దాటితో నెట్టుకొస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. మంగళ, బుధ వారాల్లో ఒత్తిడి,శ్రమ అధికం. వాయిదా పడిన పనులు  ప్రారంభిస్తారు. పదవుల స్వీకరణకు అనుకూలం. సాధ్యం కాని హామీలివ్వద్దు. గృహమార్పు కలిసి వస్తుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. వస్త్ర ప్రాప్తి, వస్తు లాభం ఉన్నాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం, చదువులపై మరింత శ్రద్ద వహించాలి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు. ప్రయాణం కలిసి వస్తుంది.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శభవార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. అవకాశాలు కలిసి వస్తాయి. ధన లాభం ఉంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. గురువారం నుండి తొందరపడి చెల్లింపులు జరపవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. శభ కార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహానిస్తుంది. పత్రాలు అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకూలతలున్నాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. శుక్ర, శని వారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం, చదువులపై శ్రద్ధ వహిస్తారు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కార్మికులు, చేతి వృత్తుల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు శుభయోగం. పురస్కారాలు అందుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. వాహనం ఇతరులకిచ్చి అవస్తలు ఎదుర్కొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. అగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సన్నిహితుల కలయికతో కుదుటపడుతారు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆది, సోమ వారాల్లో డబ్బుకు ఇబ్బందులు ఎదురవుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అవసరాలు వాయిదా పడతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పనులు సావకాశంగాపూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. మానసికంగా కుదుటపడుతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. న్యాయ వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. అనుకూలతలున్నాయి. ప్రణాళికలు రూపొందించుకోండి. సహాయం ఆశించవద్దు. ఆదాయం సంతృప్తికరం. ఊహంచని ఖర్చులే ఉంటాయి. బుధ, గురు వారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి సలహా పాటించండి. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. న్యాయ, వైద్య సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయానికితగ్గట్లు ఖర్చులు రూపొందించుకుంటారు. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. బంధుమిత్రులు చేరువవుతారు. పనులు సానుకూలమవుతాయి. శుక్ర, శని వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులను విశ్వసించవద్దు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అవసరం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. సంతానం, చదువులపై శ్రద్ద అవసరం. పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. కాంట్రాక్టులు దక్కకపోవచ్చు.  ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు హోదా మార్పు. స్థానచలనం.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు తక్షణం వినియోగించుకోండి. పరిచయాలు బలపడుతాయి. ఆది, సోమ వారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతుల మధ్య దాపరికం తగదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహ మరమ్మతులు చేపడుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. కంప్యూటర్ రంగాలవారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం తలపెడతారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్ద మొత్తం సహాయం తగదు. బంధుమిత్రుల వ్యాఖ్య మనస్తాపం కలిగిస్తాయి. మంగళ, బుధ వారాల్లో మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. సంయమనంతో మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల కలయిక ఏమంత ఫలితమీయవు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగ బాధ్యతల్లో మరింత మెలకువ వహించండి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
మకరం: ఉత్తరాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా  తెలుసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. గురు, శుక్ర వారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. పత్రాలు అందుకుంటారు. సంతాన విషయాల్లో శుభ ఫలితాలున్నాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. అధికారులకు హోదా మార్పు స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం అనుకూలదాయకమే. కష్టాకి తగ్గ ప్రతిఫలం ఉంది. అవకాశాలను దక్కించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం నికడగా ఉంటుంది. గృహ మరమ్మతులు చేపడుతారు. పోగొట్టుకున్న వస్తువులు లభించవు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. కార్మికులు, చేతివృత్తులవారికి ఆశాజనకం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థిక ఇబ్బందులు లేకున్నా వెలితిగా ఉంటుంది. ఖర్చులు ప్రయోజనకరం. ఆలోచనలతో సతమవుతారు. అవకాశాలు చేజారిపోతాయి. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. గృహ మార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుమంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. పుణ్య క్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-10-2020 సోమవారం రాశిఫలాలు - మల్లిఖార్జునుడిని ఆరాధించడం వల్ల...(video)