Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-10-2020 సోమవారం రాశిఫలాలు - మల్లిఖార్జునుడిని ఆరాధించడం వల్ల...(video)

Advertiesment
05-10-2020 సోమవారం రాశిఫలాలు - మల్లిఖార్జునుడిని ఆరాధించడం వల్ల...(video)
, సోమవారం, 5 అక్టోబరు 2020 (05:00 IST)
మేషం : వస్త్ర వ్యాపారులను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సభలు, సమావేశాల్లో మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. 
 
వృషభం : ఐరన్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకంగా ఉంటుంది. విదేశీయాన యత్నాలు చురుకుగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిగా పెరుగుతుంది. పెద్దల ఆహార వ్యవహారాల్లో యత్నాలు చురుకుగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత, మెళకువ వహించండి. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. 
 
మిథునం : వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. ఎరువులు, క్రిమి సంహారక మందుల వ్యాపారులకు చికాకులు తప్పవు. స్త్రీలకు స్కీములు, ప్రకటనల పట్ల అవగాహన అవసరం. 
 
కర్కాటకం : ఎంతటివారినైనా ఆకట్టుకుని వ్యవహారాలు చక్కదిద్దుతారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. భార్యాభర్తల ఆలోచనలు అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. 
 
సింహం : రావలసిన ధనం సమయానికి ఆదుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. 
 
కన్య : మీ శ్రీమతి ఇచ్చిన సలహా పాటించడం వంచింది. ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. 
 
తుల : విద్యార్థులు బజారు తినుబండరాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దారితీస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. భాగస్వామిక వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. 
 
వృశ్చికం : నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. దైవదీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, మందలింపులు వంటివి తప్పవు. 
 
ధనస్సు : రాజకీయాలలో వారికి విజయవంతం కావడంతో అధికమవుతున్నారని గమనించండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. శస్త్ర చికిత్సలు విజయవంతం కావడంతో వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. పత్రికా రంగంలో వారికి పురోభివృద్ధి కానరాగలదు. 
 
మకరం : అకాలభోజనం శారీరకశ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. తొందరపడి హామీలు ఇవ్వడం మంచిదికాదు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఆస్తి వ్యవహారాలు, భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేతి వృతతుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారముంది. 
 
కుంభం : ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. ఒక స్థిరాస్త కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. స్త్రీలకు టీవీ ఛానెళ్ళ నుంచి ఆహ్వానం, బహుమతులు అందుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. ఖర్చులు ఊహించినవే కావడంతో ఇబ్బందులు ఉండవు. 
 
మీనం : కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహ నిర్మాణాల ప్లాన్లకు ఆమోదం లభించడంతోపాటు లోన్లు మంజూరవుతాయి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-10-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్య హృదయం చదివినా..?