Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-10-2020 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చన చేస్తే.. (video)

Advertiesment
02-10-2020 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చన చేస్తే.. (video)
, శుక్రవారం, 2 అక్టోబరు 2020 (05:00 IST)
మేషం : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఫర్నిచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఉపాధ్యాయులు ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతారు. 
 
వృషభం : ఉమ్మడి నిధుల నిర్వహణలో మాటపడాల్సి వస్తుంది. పెట్టుబడులకు, క్రయ విక్రయాలలో దూకుడు తగదు. సంస్మరణలు, పూజలలో పాల్లొంగాటారు. ముందు చూపుతో వ్యవహరించడి. పెద్దలతో సోదరుల విషయాలు చర్చకు వస్తాయి. పైద అధికారుల, ప్రముఖులతో వాగ్వివాదాలకు దిగకండి. ఫ్లీడరు విశ్రాంతి పొందుతారు. 
 
మిథునం : వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పతకాలు రూపొందిస్తారు. చేపట్టిన పనులు వాయిదపడతాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి అధికం. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం : దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ధనం బాగా అందుట వల్ల ఏ కొంతయినా నిల్వచేయలేకపోతారు మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. క్రయ విక్రయ రంగాలలో వారికి కలిసివస్తుంది. స్త్రీలకు తల, కణితికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. 
 
సింహం : ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించుటవల్ల అస్వస్థతకు లోనవుతారు. బంధువులను కలుసుకుంటారు. 
 
కన్య : ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ విరోధులు కూడా మీ సహాయం అర్థిస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. స్థిరచరాస్తులు విషయం గురించి పునరాలోచన అవసరం. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం చేతికందుతుంది. కళా రంగాల పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. 
 
తుల : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహిచండి. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థుల్లో నూతన ఉత్సాహం కానవస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. కీర్తి, ప్రతిష్టలకు కించిత్ భంగం వాటిల్లే సూచనలున్నాయి. 
 
వృశ్చికం : శత్రువులు మిత్రులుగా మార్చుకుంటారు. రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. మీ కుటుంబీకులతో కలిసి వేడుకలలో పాల్గొంటారు స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. కళ, సాంస్కృతిక, క్రీడా రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యతలను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : పత్రికా రంగాలలో వారికి పనిభారం అధికమవుతుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. 
 
మకరం : ఉపాధ్యాయులు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఆలయ సందర్శనాలల ధనం బాగుగా ఖర్చు చేస్తారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. బంధువుల రాకతో గృహంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు బహుమతులను అందుకుంటారు. 
 
కుంభం : బంధువులలో మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచితులపట్ల మెళకువ అవసరం. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కుటుంబీకుల కోసం కొత్త కొత్త పథకాలను వేస్తారు. 
 
మీనం :  రాజకీయ నాయకులకు ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులకు ఎదురవుతుంది. మీ సంతానం గురించి ఆందోళన చెందుతారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మిత్రులను కలుసుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాలిపటాల్లా మారిన వేదపండితుల జీవితాలు : స్వామి స్వరూపానందేంద్ర స్వామి