Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-09-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడం వల్ల (video)

Advertiesment
29-09-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడం వల్ల (video)
, మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (05:00 IST)
మేషం : ధనం ఎంత వస్తున్నా నిల్వచేయలేకపోతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. 
 
వృషభం : సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులు నిర్లిప్త ధోరణి వల్ల సదావకాశాలు జార విడుచుకుంటారు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు. అధికారులకు బహుమతులు అందజేస్తారు. 
 
మిథునం : స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. దూర ప్రయాణాలలో బంధువులను కలుసుకుంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆహార వ్యవహారాలలో మెళకువ వహిచండి. ఒక విచిత్ర కల మీకెంతో ఆదోళన కలిగిస్తుంది. తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులకు గురికాకతప్పదు. 
 
కర్కాటకం : ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదని గ్రహించండి. బంధు మిత్రులతో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపార విషయాల్లో ఏకాగ్రత అవసరం. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
సింహం : స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. గృహంలో మార్పులు, చేర్పులు మరికొంతకాలం వాయిదావేయడం మంచిది. కుటుంబ అవసరాలు పెరగడంతో ఇబ్బందులెదుర్కొంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
కన్య : వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకులు తప్పదు. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. 
 
తుల : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలు దూరంగా ఉండటం మంచిది. ఉత్తర ప్రత్యుత్తరాలు, కీలక వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. రుణాలు తీరుస్తారు. 
 
వృశ్చికం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి అహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలకు ధనం బాగుగా ఖర్చు చేస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
ధనస్సు : స్త్రీల మనోవాంఛలు నెరవేరటంతో గృహంలో ప్రశాంతత, సౌఖ్యం నెలకొంటాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తరచూ యూనియన్ కార్యకలాపాల్లో నిమగ్నులై ఉంటారు. ఎక్కువగా శ్రమించిన కొద్ది ఫలితాలు ఉంటాయి. పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. 
 
మకరం : అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పోగొట్టుకునన అవకాశం, పత్రాలు తిరిగి పొందుతారు. ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల ఇబ్బందులకు గురికావలసి వస్తుంది. రాజకీయ నాయకులు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. 
 
కుంభం : బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయడం మంచిది. ప్రేమికులకు పెద్దలకు మధ్య సమస్యలు తలెత్తుతాయి. పెద్దల ఆరోగ్య, ఆహార విషయంలో మెళకువ చాలా అవసరం. 
 
మీనం : కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఇబ్బందులు తప్పవు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. రవాణా రంగాల వారికి ఆందోళనలు అధికమవుతాయి దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. బంధువులకు ఆర్థిక సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ''భాగ్‌ సవారి'' ఉత్స‌వం