Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

30-09-2020 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధిస్తే... (video)

Advertiesment
Daily Horoscope
, బుధవారం, 30 సెప్టెంబరు 2020 (05:00 IST)
మేషం : కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్త్రీలు పనివారలతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. భాగస్వామిక ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి.
 
వృషభం : ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం, ఒత్తిడి అధికం. కాట్రాక్టులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. మానసికాందోళన తొలగి ప్రశాంతత నెలకొంటుంది. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధికమించి అనుభవం గడిస్తారు. 
 
మిథునం : మీపై శకునాల ప్రభావం అధికం. అధికారులతో ఆచితూచి సంభాషించండి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. కీలక వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు తిరిగి పొందుతారు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం : మీ నిజాయితీపై అందరికి నమ్మకం కలుగుతుంది. బంధువులతో సంబంధాలు బలపడాయి. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. మీ గౌరవానికి భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫ్లీడర్లు ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
సింహం : ఆర్థిక విషయాల్లో మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఆందోళనలు, అల్లర్లకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దైవకార్య సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. సొంత వ్యాపారాలే మీకు అనుకూలం. ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే ఆత్రుత తగదు. 
 
కన్య : పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వల్ల అనుకోని ఇబ్బందులెదుర్కొంటారు. తాపీ పనివారికి ఆందోళనలు తప్పవు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీలు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
తుల : ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. రావలసిన ధనం అందడంతో పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గ్రహించండి. మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. 
 
వృశ్చికం : ముఖ్యుల నుంచి రావలసిన ధనం అందుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. దూరప్రయాణాల్లో మెళకువ అవసరం. విద్యార్థులు అనుకున్న లక్ష్యం వైపు దృష్టిసారిస్తారు. గృహ నిర్మాణంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వాతావరణంలో మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. 
 
ధనస్సు :  వృత్తి ఉద్యోగ రంగాల్లో వారికి మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రైవేటు సంస్థలలోవారికి ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. భాగస్వామిక చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ అవసరం. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. వస్త్ర, బంగారు రంగాల్లో వారికి పురోభివృద్ధి. 
 
మకరం : కుటుంబీకులతో సంభాషించడానికి కూడా తీరిక ఉండనంత బిజీగా గడుపుతారు. విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం చేసే విషయంలో ఆలోచన, పొదుపు అవసరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
కుంభం : స్త్రీలకు టీవీ ఛానెళ్ళ నుంచి ఆహ్వానాలు, సమాచారం అందుతుంది. మీ ప్రమేయం లేకుండానే కొన్ని చిక్కు సమస్యలు పరిష్కారమవుతాయి. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. 
 
మీనం : బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో మెళకువ వహించడి. స్త్రీల కోర్కెలు నెరవేరకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మిత్రులకిచ్చిన మాట కోసం శ్రమ, ప్రయాసలు పడవలసి ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం కొత్త బట్టలు కొనకూడదట..