Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-10-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్య హృదయం చదివినా..?

Advertiesment
04-10-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్య హృదయం చదివినా..?
, ఆదివారం, 4 అక్టోబరు 2020 (05:00 IST)
ఆదిత్య హృదయం చదివినా లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. వాహనం ఇతరులకు ఇచ్చేటప్పుడు లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీల కోరికలు, మనోవాంఛలు నెరవేరగలవు. 
 
వృషభం: వాదనలు, పోట్లాటల్లో మీ శక్తిని వృధా చేసుకుంటారు. పెద్దల ఆహార, ఆరోగ్యంలో మెలకువ చాలా అవసరం. మీ సంతానం మొండితనం అసహనానికి గురవుతారు. దైవదర్శనాల్లో చికాకు లెదురవుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది.
 
మిథునం: చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. పాత రుణాలు తీరుస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
కర్కాటకం: లౌక్యం, సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలు పనివారల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. 
 
సింహం: ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కుటుంబీకులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రాజకీయనాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. పాత వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. 
 
కన్య: స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తప్పవు మెళకువ వహించండి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. ప్రముఖుల కలయికతో మీ కార్యక్రమాల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంటాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 
 
తుల : ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. దూర ప్రయాణాల్లో పరిచయాలేర్పడతాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. పాత మిత్రులను కలుసుకుంటారు.
 
వృశ్చికం: బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. కుటుంబీకుల మధ్య పరస్పర మధ్య అవగాహన కుదరదు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
ధనస్సు: విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. రవాణా రంగంలో వారికి సంతృప్తి. బంధువుల రాకవల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రేమికుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. సభలు, సమావేశాల్లో మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం.
 
మకరం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. కొన్ని వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి గణనీయమైన అభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. 
 
కుంభం: మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు తరచు సభా సమావేశాల్లో పాల్గొంటారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. స్త్రీలు పనివారల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
మీనం: కుటుంబీకులను అనుమానించడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. మీ సంతానం వివాహ, విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్తాకోడళ్ల జగడానికి అడ్డుకట్ట వేయాలంటే.. శనివారం ఇలా..?