Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20-09-2020 నుంచి 26-09-2020 వరకు రాశి ఫలాలు- video

Advertiesment
20-09-2020 నుంచి 26-09-2020 వరకు రాశి ఫలాలు- video
, శనివారం, 19 సెప్టెంబరు 2020 (18:39 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
అనుకూలం అంతంతమాత్రమే. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా పాటించండి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. మిత భాషణ శ్రేయస్కరం. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేక పోయామన్న వెలితి వెన్నాడుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు కనిపిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు వదులుకోవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. పత్రాలు అందుకుంటారు. సంతానం, చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ధన ప్రలోభం తగదు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం కలిసి వస్తుంది.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ వారం కొంతవరకు అనుకూలమే. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. అవకాశాలను  చేజిక్కించుకుంటారు. కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ప్రముఖుల సందర్శనం అనుకూలిస్తుంది. పనులు హడావిడిగా సాగుతాయి. కొత్త యత్నాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడుతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. కార్మికులు, చిరువ్యాపారులకు కష్టకాలం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు, స్థాన చలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర. పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ వంతు యత్నాలు సాగించండి. ఫలితం దానంతట అదే వస్తుంది. సహాయం ఆశించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ ఆలోచనలను కొంతమంది నీరు గార్చేందుకు యత్నిస్తారు. ఖర్చులు సామాన్యం. ఆది, గురు వారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. నిర్మాణాలు, మరమ్మత్తులు చురుకుగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు. రోజువారి ఖర్చులే ఉంటాయి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. సోమ, మంగళ వారాల్లో పనుల్లో ఒత్తిడి. శ్రమ అధికం. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. గృహ మార్పు అనివార్యం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సంతాన విషయంలో శుభసూచకం ఉంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగలకు ఉద్యోగయోగం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బంధులుండవు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి ఆశాజనకం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు మెరుగుపడుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. అనురాగ వాత్సల్యం పెంపొందుతాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. బుధవారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. పదవుల కోసం యత్నాలు కొనసాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎదుటివారి అంతర్యం గ్రహించి మెలగండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కొనుగోలుదార్లతో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్థానచలనం. ప్రేమ వ్యవహారం వివాదస్పదమవుతుంది.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టుగానే జరుగుతాయి. సంప్రదింపులు సాగవు. రాబడిపై దృష్టి పెడతారు. శుక్ర, శని వారాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. ప్రముఖుల సందర్శనం కోసం నిరీక్షిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సహద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆశాజనకం.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చుల అధికం. డబ్బులకు ఇబ్బంధి ఉండదు. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. ప్రణాళికలు వేసుకుంటారు. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. గృహ మార్పు సత్ఫలితం ఇస్తుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట 
కార్యసిద్ది ధనలాభం ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పరిచయాలు బలపడుతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులు జాగ్రత్త. వాస్తు అనుగుణంగా గృహమార్పు చేపడుతారు. పనులు హడావుడిగా సాగుతాయి, కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. అవివాహితుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. భాగస్వామిక సంప్రదిపులు ఫలిస్తాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పనుల్లో ఒత్తిడి, జాప్యం, పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గురు, ఆది వారాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. మార్కెట్ రంగాలవారికి ఆశాజనకం. షేర్ల క్రయ, విక్రయాలకు అనుకూలం.
 
మకరం: ఉత్తరాషాడ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆచితూచి వ్యవహరించాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఊహలు ఫలించవు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. శుక్రవారం నాడు బ్యాంకు పనుల్లో ఒత్తిడి, జాప్యం. దంపతుల ఆలోచనలు పరస్పరం విరుద్దంగా ఉంటాయి. మీ శ్రీమతి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి. చేతి వృత్తులు, కార్మికులకు ఆశాజనకం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. మానసికంగా కుదుటపడుతారు. అంచనాలు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యహరిస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. శని, ఆది వారాల్లో ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వాస్తుకు అనుగుణంగా మరమ్మతులు చేపడుతారు. నేత్ర సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. వైద్యసేవలు అవసరం.శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఏజెన్సీలు మధ్యవర్తులను విశ్వసించవద్దు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు నిరుత్సాహకరం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు, ఉపాధి పథకాలు చేపడతారు. విద్యా సంస్థలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. హామీలు నిలబెట్టుకుంటారు. గౌరవమర్యాదలు పెంపొందుతాయి. ప్రత్యర్థులు వైఖరిలో మార్పు వస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు నెరవేరుతాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. మంగళ, బుధ వారాల్లో ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. మీ జోక్యం అనివార్యం. ఇరువర్గాల వారు మీ సలహాలు పాటిస్తారు. సంతాన విషయంలో శుభసూచకం ఉంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు మున్ముందు సత్పలితాలిస్తాయి. కంప్యూటర్ సాంకేతిక రంగాలకు కష్టకాలం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది, వాహనసేవలు ఎలా..?