Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

కరోనా నుంచి కోలుకున్నా.. తనకిప్పుడు 20 యేళ్ళ వయసు తగ్గిపోయింది : ట్రంప్

Advertiesment
కరోనా నుంచి కోలుకున్నా.. తనకిప్పుడు 20 యేళ్ళ వయసు తగ్గిపోయింది : ట్రంప్
, మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:11 IST)
కరోనా వైరస్ బారినపడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పైగా, కరోనా వైరస్ సోకిందని ఎవరూ భయపడొద్దని ఆయన హితవు పలికారు. తాను కరోను నుంచి కోలుకున్నానని, తనకిపుడు 20 సంవత్సరాల వయసు తగ్గిపోయినట్టుందని చెప్పుకొచ్చారు.
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటూ వచ్చిన డోనాల్డ్ ట్రంప్‌కు ఇటీవల కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను సైనిక ఆస్పత్రి వాల్టర్ రీడ్‌లో చేర్చి చికిత్స అందించారు. అయితే, ఆయన త్వరతిగతిన కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. 
 
అమెరికా కాలమానం ప్రకారం, సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఆయన డిశ్చార్జ్ అయ్యారు. తనకిప్పుడు చాలా బాగుందని, కొవిడ్ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తన ట్విట్టర్ ఖాతాలో ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 
 
కరోనా వైరస్ ప్రజల జీవితాన్ని డామినేట్ చేసేలా చేసుకోవద్దని, మనం అభివృద్ధి చెందామన్నారు. తన పాలనలో ఎన్నో గొప్ప గొప్ప ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని, తనకిప్పుడు 20 సంవత్సరాల వయసు తగ్గిపోయినట్లుందని అన్నారు.
 
ఆపై తాను డిశ్చార్జ్ అయి, ఎయిర్ ఫోర్స్ వన్ చాపర్‌లో తిరిగి వైట్‌హౌస్ చేరుకుంటున్న వీడియోను ట్రంప్ పోస్ట్ చేశారు. ఇక ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారన్న వార్తల నేపథ్యంలో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరుగగా, నాస్ డాక్ 466 పాయింట్లు పెరిగింది. 
 
ఈ విషయాన్ని మరో ట్వీట్‌లో ప్రస్తావించిన ట్రంప్, ఇది అమెరికాకు గొప్ప వార్తని, మన ఉద్యోగాలు మనకే ఉంటాయని అన్నారు. కాగా, ట్రంప్‌కు మరో వారం పాటు వైట్‌హౌస్‌లోనే చికిత్సను అందించాలని వైద్యులు నిర్ణయించారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలిని పెళ్లాడిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే!