Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యారాయ్‌తో కాపురం చేయలేను.. ఆమె హైక్లాస్... తేజ్ ప్రతాప్

Webdunia
ఆదివారం, 4 నవంబరు 2018 (10:21 IST)
పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన భార్య నుంచి వేరుపడాలని నిర్ణయం తీసుకున్నారు. మా ఇద్దరి దిక్కులు వేరని, అందుకే ఆర్నెల్లు కూడా కాకుండానే విడిపోవాలని అనుకున్నట్టు చెప్పారు. పైగా, విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్టు చెప్పారు. 
 
ఈ యేడాది మే నెల 12వ తేదీన తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఐశ్వర్యరాయ్ అనే యువతితో అట్టహాసంగా పెళ్లి జరిగింది. రాజకీయ నేతలు సహా వెయ్యి మందికిపైగా ప్రత్యేక ఆహ్వానితులుగా పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. డిల్లీ యూనివర్శిటీలో హిస్టరీ గ్రాడ్యుయేట్ అయిన ఐశ్వర్యారాయ్ ఆర్జేడీ ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికైన చంద్రికా రాయ్ కుమార్తె. 
 
కానీ, వీరిద్దరూ ఇపుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై తేజ్ ప్రతాప్ స్పందిస్తూ, 'మా దిక్కులు కూడా వేరు. మేము విడిపోవాలని అనుకోవడానికి కూడా అదే కారణం' అని ఆయన చెప్పుకొచ్చాడు. 'ఇంకెంత మాత్రం ఆమెతో కలిసి జీవించాలనుకోవడం లేదు' అని కుండబద్ధలు కొట్టారు.
 
కాగా, విడాకులకు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ధ్రువీకరించిన తేజ్ ప్రతాప్ 'మీరు విన్నది నిజమే. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాను. నేను ఉత్తర ధ్రువాన్నయితే, ఆమె దక్షిణ ధ్రువం. మా తల్లిదండ్రుల కళ్ల ముందే మా ఇద్దరి మధ్య చాలా గొడవే జరిగింది. ఇంకెంతమాత్రం ఆమెతో కలిసి కాపురం చేయలేను' అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments