Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సల్లూభాయ్ తక్కువేం కాదు.. రాత్రిళ్లు శారీరకంగా హింసిస్తూ ఓ ఆటాడుకున్నాడు.. ఐశ్వర్యారాయ్

సల్లూభాయ్ తక్కువేం కాదు.. రాత్రిళ్లు శారీరకంగా హింసిస్తూ ఓ ఆటాడుకున్నాడు.. ఐశ్వర్యారాయ్
, బుధవారం, 10 అక్టోబరు 2018 (14:23 IST)
బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఆయనపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సల్లూభాయ్ తక్కువోడేం కాదనీ, తనను శారీరకంగా హింసించేవాడనీ వాపోయింది.
 
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీని మీటూ ఉద్యమం ఊపేపిస్తున్న విషయం తెల్సిందే. పురుషాధిక్యత చిత్ర పరిశ్రమలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై బాధిత హీరోయిన్లు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఆ కోవలో ఇపుడు ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కూడా చేరిపోయింది. 
 
సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులపై తాను మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నానని ఐష్ గుర్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు తమ బాధను పంచుకోవడానికి సోషల్ మీడియా ఓ సాధనంగా మారిందని వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపులను బయటపెట్టడానికి సమయంతో పనిలేదని అభిప్రాయపడింది. 
 
కొంచెం ఆలస్యమైనా మీ టూ ఉద్యమం దేశంలో వ్యాపించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని ఐష్ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తనను ఏ రకంగా హింసించాడో ఐశ్వర్యారాయ్ చెప్పుకొచ్చింది. 
 
'2002లో విడిపోయిన తర్వాత కూడా సల్మాన్ ఖాన్ నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదు. అతను నా గురించి చెత్త వాగుడు వాగేవాడు. కలిసి ఉన్నప్పుడు కూడా నన్ను సల్మాన్ శారీరకంగా హింసించేవాడు. నా అదృష్టం ఏంటంటే ఆ గాయాల వల్ల శరీరంపై ఎలాంటి మచ్చలు ఏర్పడలేదు. సల్మాన్ నన్ను గాయపరచినా తెల్లవారి లేచి ఏమీ జరగనట్లే షూటింగ్‌కు వెళ్లిపోయేదాన్ని' అని ఐశ్వర్యా రాయ్ గుర్తుచేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఓయ్.. లేవయ్యా లే.. ఏంటి ఫాలో చేస్తున్నావా..' సింపుల్‌గా "పీపీఎల్ఎం" టీజర్