Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జంతువులు ఇక సంస్కృతం, తమిళం మాట్లాడుతాయ్.. రాసలీలల నిత్యానంద

నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటి రంజితతో నిత్యానంద రాసలీలల వీడియో అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిత్యానంద చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నా

జంతువులు ఇక సంస్కృతం, తమిళం మాట్లాడుతాయ్.. రాసలీలల నిత్యానంద
, బుధవారం, 19 సెప్టెంబరు 2018 (16:08 IST)
నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటి రంజితతో నిత్యానంద రాసలీలల వీడియో అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిత్యానంద చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవేంటంటే..? ఆవులు, కోతులు, సింహం, పులులు తమిళం, సంస్కృతాన్ని చక్కగా మాట్లాడేటట్లు చేస్తానని నిత్యానంద చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
 
తాను తయారు చేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా జంతువులతో స్థానిక భాషలను మాట్లాడించగలనని చెప్పారు. ఇందుకోసం నిత్యానంద ఇచ్చిన స్పీచ్‌‍కు మేళతాళాలు మోగాయి. ప్రస్తుతం ఈ ప్రయోగం సక్సెస్ అయిందని.. ఇంకా ఏడాదిలోపు జంతువులు సంస్కృతం, తమిళం మాట్లాడుతాయని నిత్యానంద చెప్పారు. తన మాటలను కొట్టిపారేయడానికి వీళ్లేదని, సరిగ్గా సంవత్సరం తర్వాత ఈ ప్రయోగం చేసి చూపించగలనని, అవసరమైతే తన వ్యాఖ్యల్ని రికార్డు చేసుకోండని నిత్యానంద తేల్చి చెప్పారు.
 
కోతులతో పాటు మరికొన్ని ఇతర జంతువులకు అన్ని రకాల ఇంటర్నల్ ఆర్గాన్స్ లేవు. వాటికి సూపర్‌ కాన్సియోస్ పురోగగతిని అందించినట్లైతే వాటిల్లో ఆయా ఆర్గాన్స్ వృద్ధి చెందుతాయి. శాస్త్రీయ, వైద్య విధానంలో దీన్ని చేసి చూపించవచ్చు. ఇది కనుక జరిగితే.. ఆవులు, ఎద్దులు ఇతర జంతువులు తమిళం, సంస్కృతం మాట్లాడతాయని నిత్యానంద అన్నారు. 
 
ఇందులో నిత్యానంద సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సాఫ్ట్ వేర్‌ను ప్రయోగించాం. అదీ సక్రమంగా పనిచేస్తుంది. కొన్ని మార్పులు పూర్తయ్యాక జంతువులు చక్కగా తమిళం, సంస్కృతం మాట్లాడుతాయని నిత్యానంద చేసిన ప్రసంగం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ప్రయోగం తర్వాత ఏలియన్ నుంచి అందరూ తనను అనుసరిస్తారని నిత్యానంద ధీమా వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం ఆర్డినెన్స్...