Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనికుడి భార్యతో అక్రమ సంబంధం... వీడియోలను నెట్‌లో పెట్టిన ప్రబుద్ధుడి భార్య

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (09:34 IST)
స్నేహం పేరుతో స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సన్నివేశాలను వీడియో తీశాడు. ఈ వీడియోలు ఆ ప్రబుద్ధుడి భార్య కంటపడ్డాయి. ఆమె ఎవరికీ తెలియకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ విషయం బాధితురాలి భర్తకు తెలియడంతో ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఈ ఘటన కన్యాకుమారి జిల్లా మార్తాండంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపంలోని కాప్పికాడు ప్రాంతానికి చెందిన రమేష్‌ సెకండ్‌ హ్యాండ్‌ బైకులను విక్రయించే షోరూమ్‌ను నడుపుతున్నాడు. అయితే, ఇదే జిల్లాలోని పంచమూర్తి అనే ప్రాంతానికి చెందిన సైనికుడు ఒకరు రమేష్ షోరూమ్‌లో ఓ ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశాడు. 
 
దీంతో ఆ సైనికుడికి, రమేష్‌కు మధ్య మంచి పరిచయం ఏర్పడటంతో రమేష్‌ తరచూ సైనికుడి ఇంటికి వచ్చే వెళ్లే సమయంలో సైనికుడి భార్యతో రమేష్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. సైనికుడు లేని సమయంలో రమేష్‌ అతని భార్యతో సన్నిహితంగా గడుపూత వచ్చాడు. 
 
ఆ సమయంలో ఆమెకు తెలియకుండా రమేష్‌ సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ వీడియోలను రమేష్‌ భార్య చూసి దిగ్భ్రాంతి గురై.. తన భర్తకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని, ఆ వీడియోలను సామాజిక మాద్యమంలో అప్‌లోడ్ చేసింది. 
 
ఆ తర్వాత ఆ వీడియోలను చూసిన సైనికుడు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రమేష్‌ వద్ద విచారణ చేస్తున్నారు. దీని గురించి సైనికుడి భార్య పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయకపోవడం వలన పోలీసులు అతన్ని హెచ్చరించి పంపించి వేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments