Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధురైలో సంపూర్ణ లాక్ డౌన్.. 705కి పెరిగిన కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (10:20 IST)
Madurai
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. కాగా, చెన్నై సహా నాలుగు జిల్లాలతో పాటు మదురై జిల్లాలోను ఈ నెల 30వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఫలితంగా నిద్రపోని నగరంగా పేరు గాంచిన మీనాక్షి దేవి వెలసిన మధురైలో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో మదురైలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
 
రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రధానంగా చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూర్‌ జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో ఈనెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా అధికంగా ఉన్న జిల్లాలో మదురై కూడా చేరింది. ఆదివారం ఒకేరోజు జిల్లాలో 68 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 705కు పెరిగింది. 
 
ఈ క్రమంలో మదురైలో కరోనా నిరోధక చర్యల్లో భాగంగా బుధవారం నుంచి దుకాణాలను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే తెరచి ఉంచాలని వ్యాపార సంఘాలు నిర్ణయించారు. అదే సమయంలో దుకాణాల ముందు ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని, అనవసరంగా బయటకు రావద్దని జిల్లా ఎస్పీ మణివన్నన్‌ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments