Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెడు తిరుగుళ్లు వద్దని చెప్పినందుకు.. భర్తను కాల్చి చంపిన భార్య!!

Advertiesment
చెడు తిరుగుళ్లు వద్దని చెప్పినందుకు.. భర్తను కాల్చి చంపిన భార్య!!
, శనివారం, 20 జూన్ 2020 (08:06 IST)
చెడు తిరుగుళ్లు వద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. తన ప్రియుడుతో కలిసి భర్తను తుపాకీతో కాల్చి చంపింది. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా నాట్రాంపల్లి సమీపంలోని పోతకుట్ట అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పోతకుట్ట గ్రామానికి చెందిన గోవిందరాజ్‌ (53) అనే వ్యక్తి దర్జీగా పని చేస్తూ భార్యాపిల్లలను పోషించుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీ జయంతిపురంలో స్పృహ కోల్పోయి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని అతన్ని ఆంబులెన్స్‌లో సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
 
దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. గోవిందరాజ్ భార్య కాంచన, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్టు తేలిందని పోలీసులు తెలిపారు. 
 
కాంచన (40)కు అదే ప్రాంతానికి చెందిన కుప్పుస్వామి(22)తో వివాహేతర సంబంధ ఏర్పడిందని, ఈ విషయం తెలుసుకున్న గోవిందరాజ్‌ భార్యను మందలించాడన్నారు. దీంతో ఆమె భర్తను హత మార్చేందుకు పథకం వేసిందని పోలీసులు తెలిపారు. 
 
కుప్పుస్వామి, ఆయన మిత్రులు ముగ్గురు కడంబూర్‌కు వెళ్లి నడికరువర్‌కు చెందిన ముత్తయ్య అనే వ్యక్తికి రూ.లక్ష అందజేసి నాటు తుపాకీ కొనుగోలు చేశారు. 
 
గత 4వ తేదీ రాత్రి 10 గంటలకు జయచంద్రపురంలో నడచి వెళుతున్న గోవిందరాజ్‌ను కుప్పుస్వామి తుపాకీతో కాల్చగా తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. ఈ కేసులో కాంచన, కుప్పుస్వామి, ముత్తయ్య సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్వారంటైన్‌లో ఉన్న బాలికను పక్కలోకి పిలిచిన ఉద్యోగి... ఎక్కడ?