హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

ఠాగూర్
మంగళవారం, 10 జూన్ 2025 (11:23 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హానీమూన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజా రఘువంశీ హత్యకు సుపారీ ఇచ్చిన సోనమ్ రఘవంశీ సోమవారం పోలీసులకు లొంగిపోయిన విషయం తెల్సిందే. తాను అమాయకురాలినని, భర్త హత్యలో తనకెలాంటి పాత్ర లేదని సోనమ్ పోలీసుల విచారణలో వెల్లడించింది. సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా, అతడి స్నేహితులు ముగ్గురు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు.
 
కాగా, రాజా రఘవంశీ మృతదేహం ఈ నెల 2వ తేదీన లభ్యం కాగా, ఆయన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇండోర్‌కు తరలించి అత్యంక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు సోనమ్ తల్లిదండ్రులు, సమీప బంధువులతో కలిసి సోనమ్ ప్రియుడు కూడా హాజరుకావడం గమనార్హం. రాజా మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చినపుడు సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా.. సోనమ్ తండ్రిని ఓదార్చుతూ కనిపించడం గమనార్హం. రాజా రఘువంశీ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోలో సోనమ్ తండ్రిని రాజ్ కుశ్వాహా ఓదార్చడం కనిపించింది. 
 
కాగా, గత నెల 23వ తేదీన హానీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన రాజా సోనమ్ దంపతులు కనిపించకుండా పోయారు. జూన్ 2వ తేదీన రాజా మృతదేహం లభ్యమైంది. సోనమ్ ఆచూకీ లభించలేదు. వారం రోజుల తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్‌లో పోలీసులకు చిక్కింది. 
 
అలాగే, మేఘాలయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజాను హత్య చేసేందుకు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా కలిసి ప్లాన్ చేయడంతో పాటు ఆనంద్, ఆకాశ్ అనే ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నట్టు వెల్లడించారు. ఈ ముగ్గురు కిరాయి ముఠా హంతకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments