Publish Date: Mon, 09 Jun 2025 (19:52 IST)
Updated Date: Mon, 09 Jun 2025 (20:08 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండోర్ కపుల్ మిస్సింగ్ కేసు (Indore couple missing case)లో హత్యకు గురైన రఘువంశ్ ను అతడి భార్యే చంపించినట్లు తెలియడంతో చాలామంది షాక్ తింటున్నారు. భర్తను హత్య చేయడం వెనుక ప్రియుడు వున్నాడని చెబుతున్నారు. మే 10న పెళ్లి చేసుకుని, మే 23న హనీమూన్ వెళ్లిన జంట మిస్ అయ్యింది. ఆ తర్వాత జూన్ 2వ తేదీన రాజా రఘువంశ్ శవమై కనిపించాడు. జూన్ 9న సోనమ్ అరెస్టయ్యింది. ఇదంతా చూసిన నెటిజన్లు ఆవేదనతో కూడిన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ప్రియుడు కావాలంటే అతడినే పెళ్లి చేసుకోవాలి. పెద్దలను ఒప్పించేవరకూ అలాగే వుండాలి. ఒకవేళ అది కుదరకపోతే ఇద్దరూ కలిసి బైటకు వెళ్లి పెళ్లి చేసుకుని జీవించాలి. కానీ ఇలా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని, ఆ తర్వాత భర్తను హత్య చేయడం దారుణం. ఏం పాపం చేసాడని అతడిని పొట్టనబెట్టుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.