Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

Advertiesment
bihar police station

ఠాగూర్

, మంగళవారం, 10 జూన్ 2025 (09:56 IST)
దేశంలో బాగా వెనుకబడిన రాష్ట్రంగా బీహార్ మొదటి స్థానంలో ఉంది. అలాంటి రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు కూడా అధికంగనే జరుగుతున్నాయి. కొందరు విద్యావంతులు అతి తెలివి ప్రదర్శించి అమాయకులను దోచుకుంటున్నారు. తాజాగా ఓ కొందరు యువకులు కలిసి ఏకంగా ఓ నకిలీ పోలీస్ స్టేషన్‌ను స్థాపించారు. ఈ పోలీస్ స్టేషన్ ద్వారా యువత నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ మోసం వివరాలను పరిశీలిస్తే, 
 
రాహుల్ కుమార్ షా అనే యువకుడు పూర్ణియా జిల్లా పరిధిలోని మోహని గ్రమంలో ఈ నకిలీ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. గ్రామీణ రక్షాదళ్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ స్థానిక యువతను నమ్మించి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. కానిస్టేబుల్, చౌకీదార్ వంటి పోస్టుల పేరుతో ఈ అక్రమ నియామకాలు చేపట్టాడు. ఒక్కో యువకుడి నుంచి రూ.2,500 నుంచి రూ.5,000 వరకు దండుకున్నట్టు తెలుస్తోంది.
 
ఇలా డబ్బులు చెల్లించిన వారికి పోలీసు యూనిఫాంలు, లాఠీలు, నకిలీ గుర్తింపు కార్డులు కూడా అందజేశాడు. వారితో గ్రామాల్లో పెట్రోలింగ్ చేయించడం, మద్యం అక్రమ రవాణాపై దాడులు నిర్వహించడం వంటి పనులు చేయించాడు. ఈ దాడుల ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగం తాను ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని తన కింద పనిచేస్తున్న నకిలీ ఉద్యోగులకు పంచిపెట్టేవాడు. అంతేకాకుండా, అక్రమ రవాణాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని లంచాలు తీసుకుని తిరిగి వారికే అప్పగించేవాడు.
 
దాదాపు ఏడాది పాటు ఈ నకిలీ పోలీసుల దందా ఎలాంటి ఆటంకం లేకుండా సాగింది. అయితే, ఇటీవల ఈ వ్యవహారం గుట్టు రట్టవడంతో ప్రధాన సూత్రధారి అయిన రాహుల్కుమార్ షా పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?