Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేసేందుకు వస్తే... అది కోసి చేతిలో పెట్టింది.. ఎక్కడ?

ఒంటరి మహిళ కదా అత్యాచారం చేస్తే ఏమవుతుంది.. ఎవరికి చెప్పుకుంటుందిలే అనుకున్నాడు ఓ యువకుడు. దీంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. రెండుమూడు సార్లు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. మహిళ ప్రతిఘటించింది.. విషయం కాస్తా బయటకు వస్తే ఇబ్బందన

Webdunia
గురువారం, 3 మే 2018 (14:53 IST)
ఒంటరి మహిళ కదా అత్యాచారం చేస్తే ఏమవుతుంది.. ఎవరికి చెప్పుకుంటుందిలే అనుకున్నాడు ఓ యువకుడు. దీంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. రెండుమూడు సార్లు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. మహిళ ప్రతిఘటించింది.. విషయం కాస్తా బయటకు వస్తే ఇబ్బందని ఎవరికీ చెప్పుకోలేకపోయింది. దీంతో ఆ యువకుడు మరింత రెచ్చిపోయాడు. ఈసారి ఎలాగైనా లొంగదీసుకుందామని వచ్చాడు. ఇక చేసేది మహిళ అతడి మర్మాంగాన్ని కోసేసింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
ఉత్తరప్రదేశ్ ఇటావాకు చెందిన మనోజ్ అనే యువకుడు తనకు దూరపు బంధువైన ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. వివాహం చేసుకుని భర్త చనిపోవడంతో స్థానికంగా హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తోందా మహిళ. దీంతో మనోజ్ ఆమెను లోబరుచుకోవాలనుకున్నాడు. గత వారం రోజులుగా ఆమె ఇంటికి వెళ్ళడం, ఆమెను ఇబ్బందులకు గురిచేసేవాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ ఇంటికి వచ్చిన మనోజ్‌ను స్తంభానికి కట్టేసి వంటకు వాడే కత్తి తీసుకుని మర్మాంగాన్ని కోసేసింది. 
 
మనోజ్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో అతన్ని వదిలేసి పారిపోయింది. నిందితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మహిళను అరెస్టు చేయకూడదని మహిళా సంఘాలన్నీ ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. ఆత్మరక్షణ కోసమే మహిళ ఇలా చేసిందని, ఆమెను అరెస్టు చేయకూడదంటున్నాయి మహిళా సంఘాలు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments