Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త కళ్లముందే భార్యను గొంతునులిమి హత్య చేసిన మరిది...

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భర్త కళ్లముందే భార్యను ఆమె మరిది గొంతునులిమి హత్య చేశాడు. తనను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత మరొకరితో సహజీవనం చేస్తున్న కోపంతో భర్తే ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా వెలు

Advertiesment
భర్త కళ్లముందే భార్యను గొంతునులిమి హత్య చేసిన మరిది...
, సోమవారం, 30 ఏప్రియల్ 2018 (13:50 IST)
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భర్త కళ్లముందే భార్యను ఆమె మరిది గొంతునులిమి హత్య చేశాడు. తనను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత మరొకరితో సహజీవనం చేస్తున్న కోపంతో భర్తే ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఉడతావారిపాళేనికి చెందిన స్రవంతి అనే యువతికి మేనమామ ఈరగ వెంకట రమణతో 15 యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. యేడాదిన్నర క్రితం నెల్లూరు వేదాయపాళెంలోని జనశక్తి నగర్‌కు వీరు కాపురం మార్చారు. అప్పటి నుంచి ధనలక్ష్మీపురానికి చెందిన చల్లా భాస్కర్ అనే వ్యక్తితో స్రవంతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ బంధం కారణంగా స్రవంతి కట్టుకున్న భర్తకు దూరమైంది. 
 
అదేసమయంలో భాస్కర్‌, స్రవంతి భార్యాభర్తలమని చెప్పుకుని తిరగడమే కాకుండా, వారం రోజుల క్రితం ధనలక్ష్మీపురంలోని ఓ ఇంట్లో కాపురం పెట్టారు. భాస్కర్‌తో సహజీవనం చేస్తున్న స్రవంతి కూలి పనులకు వెళ్లసాగింది. ఆమె పనికి వెళ్లిన సమయంలో భర్త వెంకట రమణ, సోదరుడు రాజేష్‌ వచ్చి ఇంట్లో ఉన్న కుమార్తెను తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో కుటుంబ సభ్యులం చర్చించుకుని సమస్య పరిష్కరించుకుందామని స్రవంతికి వెంకట రమణ, రాజేష్‌ కబురు పెట్టారు. ఇంతలోనే ఆదివారం వేకువజామున స్రవంతి ఇంట్లో హత్యకు గురైంది. ఈ దారుణం వేకువ జామున జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. భర్త కళ్లముందే మరొకరితో తిరుగుతోందన్న కోపం, పరువుపోతుందన్న బాధతో ఈ హత్య చేసి ఉండొచ్చని స్థానికులతో పాటు.. పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీశ్రీ రవిశంకర్ సహోదరి ఆధ్వర్యంలో అనాయాసంగా ధ్యానం... నేర్చుకోండి...