Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కానిస్టేబుల్ రాసలీలలు... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

ఓ కానిస్టేబుల్ పరాయి స్త్రీతో గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చిన రాసలీలలను కట్టుకున్న భార్య బహిర్గతం చేసింది. ఆ తర్వాత భర్తను పట్టుకుని చితకబాదింది. సిద్ధిపేట జిల్లా చేర్యాలలో వెలుగులోకి వచ్చిన ఈ

Advertiesment
Constable Romance
, శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (09:16 IST)
ఓ కానిస్టేబుల్ పరాయి స్త్రీతో గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చిన రాసలీలలను కట్టుకున్న భార్య బహిర్గతం చేసింది. ఆ తర్వాత భర్తను పట్టుకుని చితకబాదింది. సిద్ధిపేట జిల్లా చేర్యాలలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
మహబూబాబాద్ జిల్లా మర్పడగాబంగ్లా మండలం బావుజీ గూడెంకు చెందిన రమేష్, మమత 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2011లో రమేష్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. కాగా గతకొంతకాలంగా రమేష్ తన భార్యా, పిల్లలకు దూరంగా ఉంటూ వారి బాగోగులు పట్టించుకోవడం లేదు కదా.. చేర్యాలలో మరో మహిళతో కలిసి సహజీవనం చేయసాగాడు. 
 
తన భర్త బాగోతం తెలుసుకున్న మమత తల్లిదండ్రులు, ఇద్దరు కూతుళ్లను తీసుకుని చేర్యాల వెళ్లింది. అక్కడ పరాయి స్త్రీతో రాసలీలల్లో ఉన్న భర్తను చూసి కోపంతో ఊగిపోయింది. ఇద్దరినీ పట్టుకుని ఉతికి ఆరేసింది. బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు కలిసి కానిస్టేబుల్ రమేష్‌కు దేహశుద్ధి చేశారు. 
 
దీంతో కొట్టొద్దంటూ భార్య కాళ్లపై పడ్డాడు కానిస్టేబుల్. అయినా సరే ఆగ్రహంతో భార్య చాలా సేపు దాడి చేసింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి కానిస్టేబుల్ రమేష్‌తో సహా అందరినీ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మజ్ఞానులు బాలికలపై అత్యాచారు చేయడం తప్పేంకాదు : ఆశారాం బాపు