Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రహ్మజ్ఞానులు బాలికలపై అత్యాచారు చేయడం తప్పేంకాదు : ఆశారాం బాపు

బాలికలపై అత్యాచారం జరిపిన కేసులో ముద్దాయిగా తేలిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు గతంలో అత్యాచారాలపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు వెలుగు చూస్తున్నాయి.

బ్రహ్మజ్ఞానులు బాలికలపై అత్యాచారు చేయడం తప్పేంకాదు : ఆశారాం బాపు
, శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (09:03 IST)
బాలికలపై అత్యాచారం జరిపిన కేసులో ముద్దాయిగా తేలిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు గతంలో అత్యాచారాలపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు వెలుగు చూస్తున్నాయి. తనలాంటి బ్రహ్మజ్ఞానులు బాలికలపై అత్యాచారం చేయడం తప్పేంకాదని ఆశారాం బాపు భావించారని, పదహారేళ్ల  యేళ్ల బాలికపై అత్యాచారం కేసులో విచారణ సమయంలో సాక్షి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించాడు.
 
ఆశారాం తన లైంగిక సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు ఔషధాలు కూడా వాడేవాడని అతడి అనుచరుడైన రాహుల్‌ కె.సచార్‌ జోధ్‌పూర్‌ ప్రత్యేక న్యాయస్థానం ముందు వెల్లడించారట. ఆశారాంకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన 453 పేజీల తీర్పులో ఈ విషయాన్ని పొందుపరిచారు. బాలికలను తీసుకొచ్చే బాధ్యతను తనతోపాటే ఉండే ముగ్గురు యువతులకు అప్పగించాడని, టార్చిలైట్‌ పట్టుకొని వారితో కలిసి ఆశ్రమంలో తిరిగేవాడని, ఏ బాలికపై టార్చి వేస్తే ఆ బాలికను తీసుకొచ్చే వారని చెప్పారు. 
 
బాలికలపై అత్యాచారం చేస్తుండటాన్ని తాను కళ్లారా చూసి, ఇదేంటని నిలదీస్తే... తనలాంటి బ్రహ్మజ్ఞానులు బాలికలను బలాత్కరించడం పాపం కాదని చెప్పాడన్నారు. బ్రహ్మజ్ఞానులకు ఇలాంటి కోరికలేంటని ప్రశ్నించగా, మారు మాట్లాడకుండా లోపలికి వెళ్లిన ఆశారాం గార్డులతో గెంటివేయించాడని చెప్పారు. ఆశారాంతో ఉండే ముగ్గురు యువతులు బాధితురాళ్లకు గర్భస్రావాలు చేయించే వారని చెప్పారు. ఆశారాం అత్యాచారాల మీద ఫిర్యాదు చేసిన తర్వాత మరోసారి తనపై దాడి జరిగిందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిలో 1000 అపార్టుమెంట్లు... ప్రజలకు వేలం... చ.అడుగు ఎంతో తెలుసా?