Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉన్నత కొలువుల కోసమే అమ్మాయిలను పడుకోబెట్టా?

తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పూరోహిత్ వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్.డి. తివారీలా మారబోతున్నారా? ప్రస్తుతం ఈ వ్యవహారం ఇపుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.

ఉన్నత కొలువుల కోసమే అమ్మాయిలను పడుకోబెట్టా?
, బుధవారం, 18 ఏప్రియల్ 2018 (13:44 IST)
తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పూరోహిత్ వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్.డి. తివారీలా మారబోతున్నారా? ప్రస్తుతం ఈ వ్యవహారం ఇపుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. తాతగారిని సుఖపెడితే ఉచితంగా డిగ్రీలు దక్కుతాయంటూ ఓ మహిళా ప్రొఫెసర్ పలువురు విద్యార్థినులకు చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఆడియో ఒకటి ఇపుడు లీకు కాగా, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
తమిళనాడులో ఉన్నతాధికారులకు విద్యార్థినులను ఎరగా వేసి ఎలాగైనా వైస్‌ఛాన్సలర్‌ కావాలనుకున్నానని, అందుకే వారిపై పలువురు విద్యార్థినిలపై ఒత్తిడి చేసినట్టు యూనివర్శిటీ విద్యార్థినిలతో వ్యభిచారం చేయించిన మహిళా ప్రొఫెసర్ నిర్మలాదేవి వెల్లడించారు. పైగా, ఇదే విషయాన్ని ఆమె పోలీసు విచారణలో సైతం వెల్లడించినట్టు సమాచారం. 
 
సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము 5 గంటలవరకు పోలీసు ఉన్నతాధికారులు ఆమె వద్ద తీవ్ర విచారణ జరిపారు. విద్యార్థినులను పడుపు వృత్తిలోకి నెట్టేందుకు తాను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని, తనకు వీఐపీల పరిచయంలేదని తొలుత నిర్మలాదేవి బుకాయించినా, పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె సెల్‌ఫోన్లలో పలువురు వీఐపీల నెంబర్లు ఉన్న విషయాన్ని బయట పెట్టడంతో ఆమె అసలు విషయాన్ని వెల్లడించారు. 
 
ఆ తర్వాత తాను గనుక వాస్తవాలను వెల్లడిస్తే తీవ్రపరిమాణాలు చోటుచేసుకుంటాయని కూడా పోలీసులను ఆమె హెచ్చరించడం గమనార్హం. దీంతో అరుప్పుకోట పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ రాజేంద్రన్‌కు ప్రాథమిక విచారణలో బయటపడిన అంశాలను తెలియజేశారు. ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖులు చిక్కటం ఖాయమని తెలుసుకున్న డీజీపీ రాజేంద్రన్‌ వెంటనే కేసు విచారణకు సీబీసీఐడికి బదిలీ చేస్తూ తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
 
మరోవైపు, నిర్మలాదేవికి అన్ని విధాలా సహకరించిన మదురై కామరాజర్‌ విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కరుప్పుస్వామి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కరుప్పుసామి నిర్మలాదేవి పర్యవేక్షణలోనే చదివాడని, మార్కుల ఎరతో విద్యార్థినులను పడుపువృత్తిలో నెట్టే ప్రయత్నాలలో అతను కూడా సహకరించినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేణుకా చౌదరి.. మొక్కజొన్నలు అమ్మారు... రైతన్నల కోసం..?